ఆ ఇద్దరిలో ఒకరిని బిబి విజేత చేయండి : నాగబాబు

Wed Nov 25 2020 23:00:26 GMT+0530 (IST)

Make one of those two a BB winner: Nagababu

తెలుగు బిగ్ బాస్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించాడు. జబర్దస్త్ ఫ్యామిలీకి చెందిన అవినాష్ అంటే నాకు చాలా అభిమానం ఉంది. అతడికి తప్పకుండా సపోర్ట్ చేయండి అంటూనే తనకు అభిజిత్ ఆట బాగా నచ్చింది. వ్యక్తిగతంగా రెండు మూడు సార్లు కలిశాం. అతడి ప్రవర్తన చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. అతడు చాలా కూల్ గా ఆడుతున్న తీరు నాకు నచ్చింది. అభిజిత్ ను సపోర్ట్ చేయాలనుకుంటున్నా. నన్ను ఎవరు కూడా అభిజిత్ కు సపోర్ట్ చేయమని అడగలేదు. కాని అతడి ఆట తీరుతో నాకు ఎందుకో అతడికి సపోర్ట్ చేయాలని నేనే ముందుకు వచ్చాను.నాకు అవినాష్ మరియు అభిజిత్ ఇద్దరిని ఫైనల్ లో చూడాలని ఉంది. ఇద్దరిలో ఎవరిని గెలిపించినా పర్వాలేదు కాని ఇద్దరు కూడా ఫైనల్ వరకు ఉండాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. నాగబాబు చాలా క్లీయర్ గా జబర్దస్త్ ఫ్యామిలీకి చెందడం వల్ల అవినాష్ అంటే ఇష్టం.. ఆట తీరు బాగుండటం వల్ల అభిజిత్ అంటే ఇష్టం అంటూ క్లారిటీగా చెప్పాడు. ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా హ్యాపీ అంటూనే అభిజిత్ కు విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. అవినాష్ ఫైనల్ 5 లో ఉంటాడా లేదా అనేది ఈ వారం ఎలిమినేషన్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.