ట్రెండీ టాక్: 'ఉరి' లా రగిలిస్తారా 'మేజర్'?

Sun Feb 21 2021 18:00:01 GMT+0530 (IST)

Major movie is an emotional story

తీవ్రవాదం - దేశభక్తి నేపథ్యంలో ఆద్యంతం ఎమోషనల్ డ్రామాతో కట్టిపడేసిన ఎన్నో సినిమాలు సంచలన విజయం సాధించాయి. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్నాయి. బాలీవుడ్ లో ఈ తరహా కంటెంట్ ఎక్కువే అయినా తెలుగు వరకూ తక్కువ. అప్పుడప్పుడు మాత్రమే మనకు ఇలాంటి దేశభక్తి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలొస్తున్నాయి.ఇంతకుముందు హిందీలో వచ్చిన `ఉరి - ది సర్జికల్ స్ట్రైక్` తీవ్రవాదం - దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ వీర జవాను కథతో టాలీవుడ్ లో `మేజర్` తెరకెక్కుతోంది. అయితే ఊరి సినిమా మొత్తం నేషనల్ వైడ్ కనెక్ట్ అవ్వడానికి సింపుల్ రీజన్ ఇందులో ఓ రివెంజ్ పాయింట్ అండర్ ప్లే అవుతూ ఉండడమే! ఆ పాయింట్ కి దేశం మొత్తం కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిసాయి.

ఈసారి `మేజర్` కూడా ఆ ఫీట్ ని రిపీట్ చేసే సీనుంటుందా? అంటే ఉంటుందనే నమ్మకంతోనే మహేష్ - నమ్రత బృందం మేజర్ పై భారీ పెట్టుబడులు పెడుతున్నాయట. అడివి శేష్ హీరోగా వస్తున్న `మేజర్` ఓ బయోపిక్. ఇందులో యాక్షన్ అండ్ ఎమోషన్ ఉన్నా రివెంజ్ ఉండే అవకాశం లేదు..! అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను తీస్తున్నారు కాబట్టి బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెట్టాల్సి ఉంటుంది. ఏ సెంటర్స్ వరుకు ఈ సినిమా వర్కవుట్ అయినా కానీ బీ- సీ సెంటర్స్ చూడాల్సి ఉంది..! దాదాపు 40 కోట్లు పెట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నారని సమాచారం.

2008 ముంబై దాడులలో అమరవీరుడు అయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథతో మేజర్ తెరకెక్కుతంది. మరణానంతరం అతడికి భారత ప్రభుత్వం అత్యున్నత శౌర్యపురస్కారం అశోక్ చక్రను ప్రధానం చేసింది. పాన్ ఇండియా కేటగిరీకి తగ్గట్టే ఎమోషన్ తో స్క్రిప్టును మలిచారని కూడా టాక్ వినిపిస్తోంది.