విడుదలకంటే ముందే మేజర్ బిగ్ ప్లాన్

Mon May 23 2022 13:00:55 GMT+0530 (IST)

Major Big Plan before release

విభిన్నమైన సినిమాలతో మంచి క్రేజ్ అందుకుంటున్న అడివి శేష్ ఈసారి ఒక రియల్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారత సైనికుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా పై ఓ వర్గం ప్రేక్షకులు అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయిమ్ ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ప్రతి ఒక్కరిలో ఒక భావోద్వేగాన్ని కలిగించింది.ఈ సినిమాకు మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అదే సినిమాకు మంచి హైప్ ఐతే క్రియేట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా కు మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.


దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన రాష్ట్రాల్లో విడుదల కంటే ముందే ఈ ఈ సినిమా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేస్తుండటం విశేషం. కొన్ని ప్రత్యేకమైన థియేటర్లలో ఈ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించబోతున్నారు.

హైదరాబాద్ లో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ లో కూడా మేజర్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ షోలు వేయబోతున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాను అడ్వాన్స్ ప్రీమియర్స్ తోనే భారీస్థాయిలో హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ఇక్కడ ప్రత్యేకమైన స్పెషల్ ప్రీమియర్ షోలతో కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది.

జూన్ 24వ తేదీన స్పెషల్ స్క్రీన్స్ లలో విడుదల కాబోయే ఈ సినిమా ఆన్ లైన్ టికెట్లు కూడా బుక్ మై షో లో విడుదల చేయబోతున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.