*సామ్ గుట్టు చై గాళ్ ఫ్రెండ్ చేతిలో!!

Tue Mar 26 2019 15:56:54 GMT+0530 (IST)

Majili Girl Manages To Reveal Nothing

నాగచైతన్య - సమంత జంటగా నటించిన `మజిలీ` ఏప్రిల్ 5న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మధ్య తరగతి కుటుంబం భార్యా భర్తల మధ్య సంఘర్షణ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని సామ్ చెబుతోంది. అయితే ఈ సినిమాలో చై - సామ్ మధ్యలో ఆవిడ ఎవరు? మరో నాయిక దివ్యాన్ష్ కౌశిక్ పాత్ర ఏంటి? ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రమా? ఇలా రకరకాల సందేహాలు అభిమానుల బుర్ర తొలిచేస్తున్నాయి. ఇదివరకూ రిలీజైన మజిలీ టీజర్ లో చైతూ సామ్ తో కాకుండా దివ్యాన్స్ తో ఘాటైన లిప్ లాక్ వేయడం చూస్తుంటే ఇది ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కిందా? అన్న సందహాలు కలిగాయి.అయితే తాజా మీడియా మీట్ లో ఇదే ప్రశ్న దివ్యాన్స్ కౌశిక్ ని అడిగేస్తే .. అస్సలు ఆ గుట్టు నేను చెప్పలేను బాబూ! అంటూ ఎస్కేప్ అయిపోయింది. మీడియా పదే పదే ఏ ప్రశ్న అడిగినా ఆర్జీవీలా ముక్తసరిగా సమాధానాలిచ్చిందే కానీ అసలు సినిమా కథాంశం గురించి కానీ సామ్ పాత్ర గురించి కానీ తన రోల్ గురించి గుట్టు కానీ అస్సలు లీక్ చేయలేదు ఈ గడుసమ్మాయ్. ముంబై లో నట శిక్షణ పొంది అటుపై పలు టీవీ కమర్షియల్స్ లో నటించిన ఈ అమ్మడు తొలి ప్రయత్నమే చక్కని పాత్రలో నటించే అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తోంది. సమంత పూర్తి లీడ్ పాత్రలో నటిస్తోంది. మీ పాత్ర పరిమితమే కదా? అని ప్రశ్నిస్తే .. అలాంటిదేమీ లేదని .. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరల్లో జరిగిన మీడియా మీట్ లో దివ్యాన్ష్ కౌశిక్ వ్యక్తిగతంగా తన ఆసక్తుల గురించి తెలిపింది.

తెలుగు కొంచెం కొంచెం అర్థమవుతుంది. నాగచైతన్య నటించిన ఏమాయ చేశావె చూశాను. అలాగే రామ్ చరణ్ నటించిన `రంగస్థలం` రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం చూశాను. హిందీలోకి డబ్బింగ్ అయ్యే తెలుగు సినిమాలు చూస్తుంటానని దివ్యాన్ష్ తెలిపింది. రాజమౌళి తన ఫేవరెట్ డైరెక్టర్! అంటూ ఓ హింట్ కూడా ఇచ్చేసింది. అయితే మజిలీ గురించి కానీ సామ్ రోల్ గురించి కానీ అస్సలు లీక్ చేసేందుకు ససేమిరా అనేసింది. దీనిని బట్టి మజిలీ టీమ్ అసలు మ్యాటర్ లీక్ చేయద్దని ఫుల్ వార్నింగ్ ఇచ్చారా? అన్న సందేహాలు కలిగాయి. ఈ చిత్రంలో చైతూ క్రికెటర్ గా నటిస్తున్నారు మీరు తనకు గాళ్ ఫ్రెండ్ గా నటిస్తున్నారా? అంటే .. అబ్బే అలాంటివి అడగొద్దు.. నేను చెప్పలేను! అంటూ సింపుల్ గా నవ్వేసింది ఈ గడుసు పిల్ల.