Begin typing your search above and press return to search.

'న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్'కు ఎంపికైన మెయిల్ మూవీ..!

By:  Tupaki Desk   |   8 May 2021 3:30 PM GMT
న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైన మెయిల్ మూవీ..!
X
ఓవైపు ఇండస్ట్రీలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా మరోవైపు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఓ గుడ్ న్యూస్ ఆనందం కలిగిస్తుంది. టాలీవుడ్ యంగ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధానపాత్రలో ఈ ఏడాది ప్రారంభంలో 'కంబాలపల్ల కథలు' ఓ వెబ్ ఫిల్మ్ సిరీస్ అంటూ మొదటగా 'మెయిల్ చాప్టర్ 1' అనే వెబ్ ఫిల్మ్ తెరకెక్కించారు. తెలుగు ఓటిటి ఆహా వేదికగా డిజిటల్ రిలీజ్ అయినటువంటి ఈ మెయిల్ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. స్వప్నా మూవీస్ బ్యానర్ పై స్వప్నదత్ నిర్మించిన ఈ స్మాల్ బడ్జెట్ మూవీ.. ఓటిటి వేదికగా విపరీతంగా ఆదరణ దక్కించుకుంది. కంబాలపల్లి గ్రామంలో అప్పుడప్పుడే కంప్యూటర్ అనేది వచ్చిన సమయంలో జరిగిన పక్కా పల్లెటూరు కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ ఉదయ్ గుర్రాల. ఈ సినిమాలో మంచి పల్లెటూరు ప్రేమకథను కూడా సహజంగా చూపించారు మేకర్స్.

కంబాలపల్లిలో కంప్యూటర్ వచ్చిన కొత్తలో అసలు ఏం జరిగింది..? గ్రామాలలో యువత కష్టాలు ఎలా ఉంటాయనే సన్నివేశాలు చాలా బాగా రూపొందించాడు దర్శకుడు. ప్రియదర్శితో పాటు హర్షిత్ - గౌరీ ప్రియా కూడా ప్రధానపాత్రల్లో నటించారు. అయితే ఇటీవలే ఈ మెయిల్ మూవీకి సంబంధించి ఓ గుడ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. మెయిల్ మూవీ ఈ ఏడాది 'న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శనకు సెలెక్ట్ అయినట్లు సమాచారం. ఈ విషయం గురించి సంతోషంతో స్వప్నదత్ - డైరెక్టర్ ఉదయ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 'ఏ బ్యూటీఫుల్ మూమెంట్ ఆఫ్ మెయిల్'అంటూ నిర్మాతలకు థాంక్స్ తెలిపాడు దర్శకుడు. న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ జూన్ 4 నుంచి ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం ఈ గుడ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ కంబాలపల్లి కథలు నుండి సెకండ్ మూవీ ఎప్పుడు వస్తుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.