మళ్లీ అనిల్ రావిపూడితో మహేష్.. అనుకున్నదే జరిగిందిగా..!

Sun Feb 28 2021 13:00:02 GMT+0530 (IST)

Mahesh with Anil Ravipudi again .. as expected ..!

మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’తో బిజీగా ఉన్నాడు మహేష్. ఈ మూవీ ముగిసిన తర్వాత మరోసారి అనిల్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రిన్స్.అయితే.. వాస్తవానికి ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ సినిమా చేయాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన తర్వాత జక్కన్న చేపట్టే ప్రాజెక్టు ఇదే. అయితే.. దానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 13న రిలీజ్ కాబోతోంది. అంటే.. ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. ఆ తర్వాత మహేష్ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి షూటింగ్ మొదలు పెట్టడానికి చాలా సమయం పడుతుంది.

ఇటు ‘సర్కారు వారి పాట’ను వచ్చే సంక్రాంతికి బరిలో దిగబోతోంది. అంటే దాదాపు సెప్టెంబరు నాటికే ఈ సినిమా ముగిసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రాజమౌళి సినిమా మొదలయ్యే వరకూ ప్రిన్స్ ఖాళీగానే ఉండాల్సి వస్తుంది. అందుకే.. ఈ గ్యాప్ లో ఓ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట మహేష్.

ఈ విషయం తెలుసుకున్న పలువురు దర్శకులు మహేష్ ను మీటయ్యారు. వీరిలో వంశీపైడిపల్లి అనిల్ రావిపూడి ముందు వరసలో ఉన్నారు. అయితే.. ఛాన్స్ మాత్రం అనిల్ కే దక్కుతుందని సమాచారం. ఆల్మోస్ట్ మహేష్ ఓకే చెప్పేవాడని సర్కారువారి పాట చిత్రీకరణ ముగియగానే.. అనిల్-మహేష్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని టాక్. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.