మహేష్ టాటూ.. ఒరిజినల్ ప్లాన్ వేరేనట!

Mon Jun 01 2020 19:30:28 GMT+0530 (IST)

Mahesh Tattoo .. Original Plan is changed

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్ మహేష్ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నిన్నే విడుదలైంది. ఫస్ట్ లు కు పోస్టర్.. మహేష్ గెటప్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మహేష్ మెడ మీద ఉన్న ఒక రూపాయ పచ్చబొట్టు అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ రూపాయి పచ్చబొట్టు ట్రెండ్ గా మారుతుందని.. త్వరలో మహేష్ ఫ్యాన్స్ ఈ పచ్చబొట్టుతో దర్శనమిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ పచ్చబొట్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మొదట రూపాయ పచ్చబొట్టు అనుకోలేదట.. డాలర్ టాటూ అనుకున్నారట. కారణం ఏంటంటే సినిమా అమెరికా నేపథ్యంలో సాగుతుందట. అయితే మహమ్మారి ప్రబలడం కారణంగా ఇప్పుడు అమెరికాలో షూట్ చెయ్యడం అంత సులువు కాదు. అందుకే కథను ఇండియా నేపథ్యానికి అనుగుణంగా మార్చారట. అందులో భాగంగా ఆ టాటూ ను రూపాయగా మార్చారట.

కారణం ఏదైనా ఈ పచ్చబొట్టు మాత్రం ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను పెంచేసింది. మహేష్ బాబు గెటప్ మారడం లేదు.. రొటీన్ గా ఉంటోంది అనే రొటీన్ విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చినట్టేనని ఫ్యాన్స్ కూడా సంబరపడుతున్నారు.