Begin typing your search above and press return to search.

మహేష్‌ జోరు.. బర్త్‌ డే సర్‌ప్రైజ్‌ ఖాయమేనా?

By:  Tupaki Desk   |   18 July 2021 7:02 AM GMT
మహేష్‌ జోరు.. బర్త్‌ డే సర్‌ప్రైజ్‌ ఖాయమేనా?
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌ సిటీలో స్పీడ్ గా జరుగుతోంది. దుబాయి షెడ్యూల్‌ ముగించుకుని వచ్చిన తర్వాత వెంటనే రామోజీ ఫిల్మ్‌ సిటీలో రెండవ షెడ్యూల్‌ కు ప్లాన్‌ చేశారు. షూటింగ్‌ ఒకటి రెండు రోజులు జరిగిన వెంటనే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిపి వేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు సెకండ్‌ షెడ్యూల్‌ లో ఎట్టకేలకు జాయిన్ అయ్యాడు. ఫిల్మ్ సిటీలో వేసిన భారీ బ్యాంక్ సెట్టింగ్‌ లో మహేష్ బాబుతో పాటు కీలక నటీ నటులు మరియు జూనియర్ ఆర్టిస్టులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బ్యాంకు లోపల సన్నివేశాలతో పాటు బ్యాంక్‌ బయట సన్నివేశాలను కూడా చేస్తున్నారట.

అతి త్వరలోనే కీర్తి సురేష్‌ కూడా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ కు సంబంధించిన క్లారిటీ ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇక మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ కు మరీ ఎక్కువ సమయం తీసుకోవద్దని భావిస్తున్నారు. గత ఏడాది ప్రారంభం అవ్వాల్సిన సినిమా కాస్త కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. కనుక ఇప్పుడు సాధ్యం అయినంత త్వరగా సినిమాను ముగించాలనే నిర్ణయానికి వచ్చారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ వరకు షూటింగ్‌ ను ముగించాలని మహేష్‌ బాబు భావిస్తున్నాడు.

మహేష్‌ బాబు జోరుగా షూటింగ్ లో పాల్గొంటున్న నేపథ్యంలో ఆయన బర్త్‌ డే అయిన ఆగస్టు 9 కి టీజర్ లేదా పోస్టర్‌ రావడం పక్కా అన్నట్లుగా అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు. మహేష్ బాబు సర్కారు వారి పాట ప్రీ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాస్త గడ్డం మెడ పైన రూపాయి కాయిన్‌ ఇంకా కాస్త పెద్ద జుట్టు ఇలా ప్రతి విషయాన్ని ఇప్పటికే మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. కనుక సినిమా సర్‌ ప్రైజ్ ఖాయం అంటూ మహేష్ బాబు అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. కనుక ఇంత సమయం ఉండగానే టీజర్‌ ను విడుదల చేయడం అనుమానమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

టీజర్‌ రాకున్నా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ మాత్రం పక్కగా వస్తుంది. ఒక వేళ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రాకుంటే దర్శకుడు పరశురామ్‌ ను మహేష్‌ అభిమానులు వేసుకోవడం ఖాయం. అందుకే ఫస్ట్‌ లుక్‌ కోసం ఇప్పటికే ఫొటో షూట్‌ ను కూడా ప్లాన్‌ చేశారని సమాచారం అందుతోంది. మొత్తానికి సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ బ్యాంక్‌ సెట్టింగ్ లో జెట్‌ స్పీడ్‌ తో దర్శకుడు పరశురామ్‌ చేస్తున్నాడు. ఇక సర్కారు వారి పాట కు గుమ్మడి కాయ కొట్టడమే ఆలస్యం వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు మహేష్‌ బాబు రెడీ అవ్వబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ లేదా టైటిల్‌ ను మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.