మహేష్ అడ్వెంచర్ కోసం జక్కన్న దిగాడు

Wed May 25 2022 11:19:59 GMT+0530 (IST)

Mahesh on Jakkanna for adventure

దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలైతే వీరి కలయికలో గత పదేళ్లకు ముందే సినిమా రావాల్సింది. కానీ మిగతా కమిట్మెంట్స్ కారణంగా ఇద్దరు మిగతా సినిమాలతో బిజీ కావడం వలన సరైన స్లాట్ దొరకలేదు. మొత్తానికి ఒక టైమ్ అయితే ఫిక్స్ అయింది. మహేష్ బాబు తో సినిమా చేయడానికి రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి రెడీ అయ్యాడు.అసలైతే ఈ ప్రాజెక్టు ఈ ఏడాది మొదట్లోనే ప్రారంభం కావాలి.. కానీ కరోనా కారణంగా గా RRR SVP వాయిదా పడుతుండడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. మొత్తానికి RRR సినిమా విజయంతో మంచి ఆనందంలో ఉన్న రాజమౌళి ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్లాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇప్పటికే మరొక వెకేషన్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఈ క్రమంలో రాజమౌళిని రీసెంట్ గా ఇండియాగా వచ్చిన వెంటనే ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాలని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక పాయింట్ అయితే అనుకున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుతో అడ్వెంచర్ యాక్షన్ సినిమాను తెరకెక్కించాలని రాజమౌళి బలమైన కోరిక. అందుకు తగ్గట్టుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా మంచి కథను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో అయితే ఆయన ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఒక కథను అనుకుంటున్నట్లుగా చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా సిద్ధం కాలేదని కూడా అన్నారు. సాధారణంగా రాజమౌళి స్క్రిప్టు దశలోనే నమ్మకంగా అనిపిస్తేనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి వెళ్తాడు.

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టు సిద్ధం కావడానికి ఈ ఏడాది చివరి వరకు సమయం పట్టవచ్చు. ఇక రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.