Begin typing your search above and press return to search.

కౌబోయ్ గెట‌ప్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ మ‌హేష్ మేన‌ల్లుడు

By:  Tupaki Desk   |   20 Jun 2021 9:43 AM GMT
కౌబోయ్ గెట‌ప్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ మ‌హేష్ మేన‌ల్లుడు
X
సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు .. గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా క‌థానాయ‌కుడిగా న‌టించే సినిమా గురించి ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా టీజ‌ర్ రాక‌కు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. వ‌కీల్ సాబ్ ఫేం శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ ఆధ్వర్యంలో పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిధి అగర్వాల్ ఇందులో క‌థానాయిక‌. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తుండగా నరేష్- సత్య- అర్చన సౌందర్య సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 23 న టైటిల్ టీజర్ ని విడుద‌ల చేయనున్నామ‌ని ప్ర‌క‌టిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.

పోస్ట‌ర్ ఆద్యంతం మిస్టీరియ‌స్ డార్క్ బ్యాక్ గ్రౌండ్ క‌ల‌ర్ మెస్మ‌రైజ్ చేస్తోంది. హీరో కౌబోయ్ లుక్ క్యూరియాసిటీని పెంచింది. ప‌డ‌మ‌టి కొండ‌ల్లో సూర్యుడు అస్త‌మిస్తున్న వేళ అస‌లేం జ‌రిగింది? అన్న క్యూరియాసిటీ పోస్ట‌ర్ లో క‌నిపిస్తోంది. మ‌రోవైపు మ‌హేష్ న‌టించిన ట‌క్క‌రి దొంగ షేడ్స్ ని కూడా ఈ పోస్ట‌ర్ ఆవిష్క‌రిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం సమకూర్చగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. చంద్ర శేఖర్ రవిపతి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌. కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య