షాక్: గౌతమ్ కృష్ణకు అన్నయ్యలా కనిపిస్తున్నాడు!

Sat Jul 24 2021 13:13:06 GMT+0530 (IST)

Mahesh looks like an elder brother to Gautam Krishna

సూపర్ స్టార్ మహేష్ వయసు ఎంత..? ఠకీమని చెప్పేయడం కష్టమే. అతడి ఏజ్ 45 అంటే అంతా షాకింగ్ గానే చూస్తారు. కానీ అది నిజమేనని గట్టిగా చెబితేనే నమ్ముతారు. అంతగా అతడు ఆ లుక్ ని ఛరిష్మాని మెయింటెయిన్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నారు. మహేష్ ఇంకా 18 ప్లస్ అంటే నమ్మేసేంతగా లుక్ ని ఆవిష్కరించడం ప్రతిసారీ షాకిచ్చే విషయమే.టాలీవుడ్ లో మహేష్ శైలి పూర్తిగా విలక్షణమైనది. లుక్ పరంగా అతడి ఎంపికలు వేరు. నిజానికి ప్రభాస్ .. రానా .. చరణ్.. బన్ని లాంటి స్టార్లు భారీగా కండలు పెంచి మ్యాకో మ్యాన్ లుక్ తో కనిపించేందుకు ప్రయత్నిస్తే అందుకు భిన్నంగా మహేష్ అల్ట్రా స్మార్ట్ లుక్ కోసం తపించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకుముందు సుకుమార్ 1-నేనొక్కడినే మూవీ కోసం మొదటి సారి షర్ట్ విప్పి చూపించాడు. అది కూడా వెనక వైపుగా క్షణ కాలం చూపించి వదిలేశారు. కానీ ఆ తర్వాత కూడా అతడు పూర్తిగా షర్ట్ విప్పి మ్యాకో మ్యాన్ లా ఎప్పుడూ కనిపించలేదు.

అయితే మహేష్ తన రూపానికి తగ్గట్టు అద్భుతమైన ఫిజిక్ తో మైమరిపిస్తూ ఇప్పటికీ టీనేజర్ లానే కనిపిస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచి అతడు ఇస్మార్ట్ లుక్ తోనే కనిపించారు. మొదటి సినిమా `రాజకుమారుడు`లో నటించినప్పుడు .. ఆ తర్వాత `యువరాజు` సినిమాలోనూ కాస్త చబ్బీగా కనిపించిన మహేష్ .. మురారిలో విలేజ్ బోయ్ తరహా లుక్ తో కనిపించారు. ఇక పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి తో అతడి లుక్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనిపించేంత స్టైలిష్ గా కనిపించారు.

ఇటీవల తన కెరీర్ 25వ సినిమా మహర్షిలో ఏకంగా కాలేజ్ బోయ్ లా కనిపించి సర్ ప్రైజ్ చేశారు. పోకిరి తర్వాత లాంగ్ జర్నీని సాగించాక కూడా 2019 నాటికి అతడు అలా కనిపించడం బిగ్ సర్ ప్రైజ్.. `భరత్ అనే నేను`లో స్టైలిష్ సీఎంగా కనిపించిన మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మాస్ అవతార్ లో కనిపిస్తూనే స్టైలిష్ బిజినెస్ మేన్ లుక్ లోనూ కనిపిస్తాన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దుబాయ్ .. హైదరాబాద్ సహా పలు అందమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని అత్యంత రిచ్ లుక్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాస్ యాక్షన్ మరో లెవల్లో ఉంటుందని థమన్ బాణీలు పెద్ద ప్లస్ కానున్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో కొన్ని సీన్లు మైండ్ బ్లాక్ చేసే రేంజులో వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

థమ్సప్ ప్రకటనలో ..!

మరోవైపు మహేష్ థమ్సప్ యాడ్ లో ఏకంగా టీనేజర్ లా కనిపిస్తూ షాకిస్తున్నారు. ఆయన గౌతమ్ కృష్ణ (మహేష్ వారసుడు)కు అన్నయ్యా? అన్నంత యంగ్ గా కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఖాళీ చేసిన థమ్సప్ బాటిల్ ని చూపిస్తూ మహేష్ ఇచ్చిన ఫోజులు వైరల్ గా మారాయి. అన్నట్టు కెరీర్ ఆరంభం నుంచి మహేష్ ని థమ్సప్ కంపెనీ వదిలినట్టే లేదు. మెగాస్టార్ చిరంజీవి .. చరణ్ లాంటి స్టార్లు థమ్సప్ కి కొన్నాళ్ల పాటు ప్రచారం చేసారు. ఇటీవల మహేష్ ఖాతాలోనే పర్మినెంట్ గా ఉంది ఈ బ్రాండ్. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి మహేష్ థమ్సప్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే.