Begin typing your search above and press return to search.

#మ‌హేష్‌.. ఇంకా బ‌డికి పోయే పిల్లాడిలా ఉన్నాడు!

By:  Tupaki Desk   |   28 Feb 2021 11:03 AM GMT
#మ‌హేష్‌.. ఇంకా బ‌డికి పోయే పిల్లాడిలా ఉన్నాడు!
X
చూస్తుంటే మ‌హేష్ ఏజ్ ఏకంగా ఇర‌వై త‌గ్గిన‌ట్టే క‌నిపిస్తున్నాడు. ఏజ్ 45 క్రాస్ చేసినా ఇంకా ప‌సి పిల్లాడినే త‌ల‌పిస్తున్నాడు. `నాని` సినిమాలో వ‌య‌సెదిగినా మ‌న‌సెద‌గ‌ని పిల్లాడిలా క‌నిపించాడు కానీ.. రియాలిటీలో అస‌లు మ‌హేష్ ఏజే ఎద‌గ‌డం లేదు. ఇంకా టీనేజీ పిల్లాడిలా అప్పుడే ప‌ది పూర్తి చేసి కాలేజీలో అడుగుపెడుతున్న అల్ల‌రి వ‌యసు కుర్రాడిలా కనిపిస్తున్నాడు మ‌హేష్‌.అస‌లు అదేం మాయా జాల‌మో.. వింత స‌మ్మోహ‌నం అత‌డిలో క‌నిపిస్తోంది. అస‌లేం తింటాడో కానీ మ‌రీ అంత టీనేజీ లుక్ మ‌హేష్ కే ఎలా సాధ్యం? అంటూ ఖంగు తిన‌డం అభిమానుల వంతైంది.

తాజాగా అత‌డు త్వ‌ర‌గా ఎదిగేస్తున్న త‌న గారాల ప‌ట్టీ సితా పాప‌తో క‌లిసి ఫ‌న్ గేమ్స్ ఆడుతున్న ఫోటో ఒక‌టి రివీల్ అయ్యింది. అది చూడ‌గానే మొన్నే టెంథ్ పాస‌య్యాడా? అన్న డౌట్ ఎవ‌రికైనా రావ‌డం గ్యారెంటీ. స‌ర్కార్ వారి పాట కోసమే ఇలా గెట‌ప్ ఛేంజ్ చేశాడా ఏమో కానీ... అస‌లు ఆ మీస‌క‌ట్టు తీసేసి టీష‌ర్ట్ తొడిగి సోడా బుడ్డి క‌ళ్ల‌ద్దాలు పెడితే.. బ‌డికి పోయే పిల్లాడి మాదిరే క‌నిపిస్తున్నాడు!! అస‌లు ఈ ఏజ్ లో ఇదెలా సాధ్యం బాబోయ్!! అంటూ ఎక్స్ ప‌ర్టులే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏజ్ త‌గ్గిపోయే అమృతం కుండ ఏదైనా తాగాడా ఏమిటో? బాబూ మ‌హేష్ కాస్త‌యినా ఆ టాప్ సీక్రెట్ చెప్ప‌వూ అనేస్తున్నారు!!