Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్ - కొరటాల' మూవీలో మహేష్ హీరోయిన్..?

By:  Tupaki Desk   |   15 May 2021 11:52 AM GMT
ఎన్టీఆర్ - కొరటాల మూవీలో మహేష్ హీరోయిన్..?
X
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. కొంతకాలంగా ప్రతి సినిమాకు వేరియేషన్స్ - డిఫరెంట్ బాడీలాంగ్వేజ్ లతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ గా పరిచయం కాబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ తదుపరి 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇదివరకు ఈ కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సూపర్ హిట్ కాంబో సెకండ్ టైం జతకట్టే సరికి సినిమా పై అప్పుడే అంచనాలు భారీగానెలకొన్నాయి.

ప్రస్తుతం కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీ రూపొందిస్తున్నాడు. రెండేళ్లకు పైగా కొరటాల ఆచార్య సినిమా పై వర్క్ చేస్తున్నాడు. గతేడాది రిలీజ్ అవ్వాల్సిన ఆచార్య మూవీ.. కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరికి ఈ ఏడాది మేలో రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్రకటించగా.. ఈసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. చివరిదశలో ఉన్నటువంటి ఆచార్య షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో మూవీ వీలైనంత త్వరగా తెరకెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ లేనందున ఆ సమయాన్ని ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం కేటాయిస్తున్నాడు.

కానీ ఈసారి స్క్రిప్ట్ లో భారీ మార్పులతో పాటు సాలిడ్ సబ్జెక్టు యాక్షన్ ఉండబోతుందని టాక్. ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ పరిచయం కాబోతున్నాడు. కాబట్టి స్క్రిప్ట్ కూడా అదే రేంజిలో ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే కొరటాల కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ - కొరటాల మూవీ హీరోయిన్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కొరటాల పరిచయం చేసిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీని కొరటాల ఆల్రెడీ సంప్రదించడం జరిగిందట. అందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్. భరత్ అనే నేను సినిమాతో కియారా టాలీవుడ్ కి పరిచయం అయింది. మరి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో సినిమా చేస్తుందా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.