Begin typing your search above and press return to search.

మహేష్ మరో ట్విట్టర్ రికార్డు.. మరే తెలుగుహీరో బీట్ చేయలేడుగా!!

By:  Tupaki Desk   |   24 Jan 2021 2:30 AM GMT
మహేష్ మరో ట్విట్టర్ రికార్డు.. మరే తెలుగుహీరో బీట్ చేయలేడుగా!!
X
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యం అయిపోయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియా అనేది సినీ సెలబ్రెటీలు వారి అభిమానులకు దగ్గరయ్యేందుకు మంచి మార్గంలా పాపులర్ అయింది. సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలతో పాటు వారి సినిమాలకు సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ రోజురోజుకి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలసిందే. ఆయన చెప్పాలనుకున్న విషయాలను, తన సినిమా విశేషాలను అభిమానులతో పాటు ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఉంటాడు. అయితే కొన్నేళ్లుగా మహేష్ ట్విట్టర్ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నాడు. ఇన్నేళ్ల నుండి సూపర్ స్టార్ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరుగుతూనే ఉంది. తాజాగా మహేష్ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఇటీవల టీమిండియా గబ్బా టెస్ట్ లో ఘనవిజయం సాధించిన సందర్బంగా మహేష్ చేసిన ట్వీట్ లక్ష లైక్స్ పొందింది.

మహేష్ తన ట్వీట్లకు లక్ష లైక్స్ పొందడం ఇది మొదటిసారి కాదు. మహేష్ లక్ష లైక్స్ పొందిన 19వ ట్వీట్ ఇది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రికార్డు ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. మహేష్ ట్విట్టర్ ఖాతాకు 11.1మిలియన్ల ఫాలోయింగ్ కలిగి టాప్ లో ఉన్నాడు. అయితే మహేష్ 19సార్లు లక్ష లైక్స్ పొంది ప్రథమ స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐదుసార్లు లక్ష లైక్స్ పొందాడు. ఈ విధంగా రానా మూడుసార్లు పొందగా.. నితిన్ రెండుసార్లు తన ట్వీట్లకు లక్ష లైక్స్ పొందాడు. ఇక అల్లు అర్జున్, రాంచరణ్, నానిలు ఒక్కోసారి ఈ ఫీట్ సాధించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ దుబాయ్ లో ఫ్యామిలీ వేకెషన్ కి వెళ్లాడు. ఇక సోమవారం నుండి మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. చూడాలి మరి సర్కారు వారి పాట ఎలా ఉండబోతుందో!