Begin typing your search above and press return to search.

పీకాక్ పై పిచ్చెక్కిస్తున్న మ‌హేష్‌!

By:  Tupaki Desk   |   28 May 2022 7:47 AM GMT
పీకాక్ పై పిచ్చెక్కిస్తున్న మ‌హేష్‌!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలున్నా..మ‌హేష్ ప్ర‌త్యేక‌త వేరు. ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌న‌కు ఎవ‌రు పోటీ? అన్న చందంగా మ‌హేష్ అలా ముందుకు సాగిపోతున్నారు. ఇక గాళ్స్ లో మ‌హేష్ క్రేజ్ గురించి చెప్ప‌దేముంటుంది. ప్రిన్స్ అంటే అభిమానించి డై హార్డ్ లేడీ ఫ్యాన్స్ ఎంతో మంది.

రాకుమారుడిని త‌ల‌చుకుంటూ క‌ల‌లు క‌నే భామ‌లెంతో మంది. ఇటీవ‌లే స‌ర్కారు వారి పాట‌తో మ‌రో భారీ స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా స‌క్సెస్ మీట్ లో భాగంగా ఫ్యాన్స్ తో పాటు..గాళ్స్ తోనూ ముచ్చ‌టించారు. గాళ్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చి మ‌న‌సు దోచారు. ఇక మ‌హేష్ సోష‌ల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటారు.

ట్విటర్..ఇన్ స్టాలో ఏ వెకేష‌న్ కి వెళ్లినా ఆఫోటోల్ని అభిమానుల‌తో పంచుకుంటారు. సినిమా త‌ప్ప మిగ‌తా విష‌యాల్ని ఆక్క‌డ చ‌ర్చించ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ఆ ర‌కంగా సామాజిక మాధ్య‌మాల్లో మంచి అనుచ‌ర గ‌ణాన్ని సంపాదించారు. తాజాగా మ‌హేష్ క‌వ‌ర్ పేజీకి ఇచ్చిన ఫోటో ఒక‌టి గాళ్స్ లో చ‌ర్చ‌కు దారి తీసింది.

పీకాకా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీకి ఎక్కిన మ‌హేష్ మ‌రోసారి గాళ్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ల‌గ్జ‌రీయ‌స్ కారుపై కాలు పెట్టి స్టైలిష్ గా క‌వ‌ర్ పేజీ కోసం ఓ ఫోజు ఇచ్చారు. బ్లాక్ కల‌ర్ ప్యాంట్..ష‌ర్ట్ పై పువ్వుల డిజైన్ లెద‌ర్ కొట్ ధ‌రించి ల‌మిల్క్ బోయ్ మ‌తులు పొగొడుతున్నారు. ఈ ఫోటోని జ‌తిన్ కాంపానీ క్యాప్చ‌ర్ చేసారు.

రిజ్వాన్ అలీ... స‌ల్లు హెయిర్ స్టైలిష్ లు కాగా.. పీకాక్ అఫీషియ‌ల్ డిజైన‌ర్ మ‌హ‌ష్ ని ఇలా స్టైలిష్ గా మార్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు మ‌హేస్ ని స్టైలిష్ లుక్ లో చూసి మురిసిపోతున్నారు. వీళ్ల‌లో ఎక్కువ‌గా గాళ్స్ ఉండ‌టం విశేషం.

మ‌హేష్ ప్ర‌యివేట్ సంస్థ‌ల‌కు మంచి బ్రాండ్ అంబాసిడ‌ర్ గానూ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో ఏ హీరో కి లేన‌ని ఎండార్స్ మెంట్ మ‌హేష్ ఖాతాలోనే ఉన్నాయి. అందుకుగాను కోట్ల రూపాయాలు పారితోషికంగా కంపెనీలు చెల్లిస్తున్నాయి.

ఇటీవ‌లే మ‌హేష్ స‌ర్కారు వారి పాట‌తో ఏకంగా వ‌రుస‌గా నాల్గ‌వ స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. 'భ‌ర‌త్ అనే నేను'..'మ‌హ‌ర్షి'..'స‌రిలేరు నీకెవ్వ‌రు' తో హ్యాట్రిక్ అందుకోగా అదే వేవ్ లో స‌ర్కారుతోనూ విజ‌యాన్ని అందుకున్నారు. ఈ వియంతో మ‌హేష్ ఇమేజ్ రెట్టింపు అయింది.

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. యూర‌ప్ ట్రిప్ లో ఉన్ మ‌హేష్ త్వ‌ర‌లోనే ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. అనంత‌రం పాన్ ఇండియాలో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇది వ‌చ్చే ఏడాది మిడ్ లో ప్రారంభం కానుంది.