Begin typing your search above and press return to search.

సితార విష‌యంలో మ‌హేష్ ఫుల్ క్లారిటీ!

By:  Tupaki Desk   |   11 May 2022 1:30 PM GMT
సితార విష‌యంలో మ‌హేష్ ఫుల్ క్లారిటీ!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన చిత్రం విడుద‌లై దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఆయ‌న న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌రువాత వ‌స్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ పెట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `పోకిరి`కి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా పని చేపిన ద‌గ్గ‌రి నుంచే ప‌రశురామ్ కు మ‌హేష్ తో సినిమా చేయాల‌న్న‌ది డ్రీమ్‌. అది ఇన్నేళ్ల‌కు `స‌ర్కారు వారి పాట‌`తో నెర‌వేరుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం మ‌రి కొన్ని గంట‌ల్లో విడుద‌ల కాబోతోంది. అంటే ఈ గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ నేప‌థ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్ర‌ల‌కు స‌మాధానాలు చెప్పారు సూప‌ర్ స్టార్ మ‌హేష్. ఇక త‌న ముద్దుల కూతురు సితార `పెన్నీ`సాంగ్ లో క‌నిపించ‌డం, సోష‌ల్ మీడియాలో ప‌లు పాట‌ల‌కు అదిరిపోయే స్టెప్స్ వేయ‌డం వంటి వి గుర్తు చేస్తూ త‌న‌ని ఆర్టిస్ట్ ని చేస్తారా? అంటూ ప్ర‌శ్నించ‌డంతో త‌ను ఆల్ రెడీ ఆర్టిస్ట్ అయిపోయింద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే సినిమాల్లోకి తీసుకొస్తారా? అని అడిగితే మాత్రం నేటి త‌రం వాళ్ల‌కు ఏది కావాలో ఫుల్ క్లారిటితో వున్నారు. వాళ్ల‌కు న‌చ్చింది చేసేస్తున్నారు.

నేను కూడా వాళ్ల కెరీర్ ని డిసైడ్ చేయ‌డం లేదు. వారు ఏది కోరుకుంటున్నారో దాన్ని ఎంక‌రేజ్ చేయ‌డ‌మే అని సితార విష‌యంలో త‌న‌కున్న క్లారిటీని వివ‌రించారు, ఇక సోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా `ఆస్క్ మీ ఎనీథింగ్‌` పేరుతో అభిమానుల‌తో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని మ‌హేష్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. నెట్ ఫ్లిక్స్ ఫేమ‌స్ వెబ్ సిరీస్ `మ‌నీహీస్ట్`లో మీకు ఇష్ట‌మైన క్యారెక్ట‌ర్ ఏంట‌ని అడిగితే త‌న‌కు ప్రొఫెస‌ర్ రోల్ అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు మ‌హేష్.

మీరు న‌టించిన పెన్నీ సాంగ్ లో సితార క‌నిపించ‌డం ఎలా అనిపించింద‌ని అడిగితే త‌ను ఆల్ రెడీ స్టార్ అని న‌వ్వేశారు. ఇక వైఫ్ న‌మ్ర‌త గురించి మాట్లాడుతూ త‌న బెస్ట్ ఫ్రెండ్ త‌నే అని చెప్పేశాడు. అంతే కాకుండా త‌న‌నే ఎందుకు పెళ్లి చేసుకున్నార‌ని అడిగితే త‌న‌లో ప్ర‌తీ విష‌యం నాకు న‌చ్చాయి కాబ‌ట్టే త‌న‌ని పెళ్లిచేసుకున్నానన్నారు. ఇక `స‌ర్కారు వారి పాట‌` గురించి మాట్లాడుతూ ఫ‌స్ట్ పోస్ట‌ర్ లో మెడ‌పై టాటూ వున్న స్టిల్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు.

ఇదిలా వుంటే బిత్త‌రి స‌త్తితో జ‌రిపిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూని మ‌హేష్ బాబు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయ‌డం విశేషం. ఈ మ‌ధ్య కాలంలో ఏ స్టార్ హీరో ఓ ఇంట‌ర్వ్యూలో ఇలా త‌న‌ని తాను మ‌రిచి న‌వ్విన సంద‌ర్భం లేదంటే అది అతిశ‌యోక్తి కాదు. వంద వ‌య‌గ్రాలేసుకున్న పెళ్లికొడుకు గ‌దిలోకి వ‌చ్చిన‌ట్టుగా వ‌చ్చార‌ని ట్రైల‌ర్ లో మ‌హేష్ చెప్పిన డైలాగ్ ని బిత్తిరి స‌త్తి చెప్పిన తీరు న‌వ్వులు పూయించింది. ఈ డైలాగ్ విని మ‌హేష్ ప‌డి ప‌డి న‌వ్వ‌డం విశేషం.