Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న యంగ్ మహేష్ బాబు పిక్...!

By:  Tupaki Desk   |   18 Jun 2020 1:30 PM GMT
వైరల్ అవుతున్న యంగ్ మహేష్ బాబు పిక్...!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనేది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్య మహేష్ మరీ చిన్నపిల్లాడిలా టీనేజీ అబ్బాయిలా మారిపోతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇప్పుడు మహేష్ ని చూస్తే అసలు ఈయన వయసు పెరుగుతుందా.. తగ్గుతుందా అనే అనుమానం రాకమానదు. మహేష్ బాబు ప్రస్తుత వయసు 46.. కానీ ఈయన్ని చూస్తుంటే 20 ఏళ్ల లోపే ఉన్నట్లు అనిపిస్తుంది. ఫస్ట్ సినిమా నుండి ఇప్పటికీ అదే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు మహేష్. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ వర్కౌట్స్ చేస్తూ మరింత యంగ్ గా మారిపోతున్నాడు మన సూపర్ స్టార్. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ కి సంబంధించిన ఓల్డ్ పిక్ ఒకటి చక్కర్లు కొడుతోంది.

నేడు నటశేఖరుడు కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు పెళ్లి రోజు కావడంతో ఆయన పెళ్లి ఫోటో ఒకటి బయటకి వచ్చింది. రమేష్ బాబు - మృదుల నవదంపతుల పక్కన నిలబడి ఉన్న మహేష్ యంగ్ లుక్ లో ఉన్నాడు. ఆయన వైట్ కలర్ షర్ట్ టక్ ఇన్ చేసుకొని అన్నావదినలతో కలిసి పోజ్ ఇచ్చారు. ఈ ఫొటోలో మహేష్ సోదరి మంజుల కూడా ఉన్నారు. ఇప్పడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోకి మహేష్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ ఈ ఫొటోలో ఎలా ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అంటున్నారు.

మహేష్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నా కూడా తన ఇంట్లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడని అందరికి తెలిసిన విషయమే. ఇక తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన మహేష్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడంలో సరిలేరు నాకెవ్వరూ అంటూ సరదాగా గడిపేస్తున్నాడు. ఈ మధ్యే తన కెరీర్లో 27వ చిత్రం 'సర్కారు వారి పాట'ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 ప్లస్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.