మహేష్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ

Tue Feb 18 2020 22:21:45 GMT+0530 (IST)

Mahesh babu launches Vijaya Nirmala Statue

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకురాలు విజయ నిర్మల. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు డైరెక్షన్ చేసిన మహిళ దర్శకురాలిగి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డును దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన విజయ నిర్మల గత ఏడాది అనారోగ్య కారణంగా మృతి చెందిన విషయం తెల్సిందే. విజయ నిర్మల మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అంటూ ఆ సమయంలో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.విజయ నిర్మల జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు ఆమె నివాసం ఉన్న ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ ఇంట్లోనే విజయ నిర్మల విగ్రహంను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈనెల 20వ తారీకున విజయ నిర్మల మొదటి జయంతి జరుగనుంది. ఈ సందర్బంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.

విజయ నిర్మల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మహేష్ బాబు చేతుల మీదుగా జరుపబోతున్నారు. కృష్ణ మహేష్ బాబు.. తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు మరియు విజయ నిర్మల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.