#మహేష్26: టైటిల్ రిజిస్టర్ అయిందా?

Sun Jan 20 2019 20:01:27 GMT+0530 (IST)

Mahesh babu and Sukumar Movie Title

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లో 25వ చిత్రం 'మహర్షి'లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.  ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సుకుమార్ తో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.  ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది.  ఇదో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని సుకుమార్ హింట్స్ ఇచ్చాడు.ఈ సినిమా టైటిల్ గురించి ఫిలిం నగర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈమధ్యే సుకుమార్ దగ్గర పనిచేసే కోడైరెక్టర్ ఫిలిం ఛాంబర్లో 'హర హర శంభో శంకర' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట.  దీంతో ఈ టైటిల్ మహేష్ బాబు కోసమే సుకుమార్ ఫైనలైజ్ చేసి ఉంటాడని.. రహస్యంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే ఇలా తనకు సన్నిహితుడైన కో-డైరెక్టర్ చేత టైటిల్ ను రిజిస్టర్ చేయించి ఉంటాడని అంటున్నారు.  సహజంగా నిర్మాతలు తమ బ్యానర్ పై ఈ సినిమా టైటిల్స్ ను రిజిస్టర్ చేయిస్తారు. కానీ ఈ సినిమాను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ కనుక టైటిల్ రిజిస్టర్ చేస్తే వెంటనే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఇలా ఇంటిలిజెంట్ ఐడియాను అమలు పరిచాడేమో.  అయినా మహేష్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాచిపెట్టడం అంత సులువైన విషయం కాదు కదా?

ఏదేమైనా టైటిల్ మాత్రం బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సుకుమార్ ఈ సినిమా చేస్తూ ఉండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.  గతంలో మహేష్ తో సుకుమార్ '1 నేనొక్కడినే' సినిమాను తెరకెక్కిస్తే అది బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాతో మహేష్ కు ఒక సూపర్ హిట్ అందించాలని సుకుమార్ పట్టుదలతో ఉన్నాడట.