Begin typing your search above and press return to search.

నాన్నా.. అంటూ ట‌చ్ చేసిన సూప‌ర్ స్టార్!

By:  Tupaki Desk   |   31 May 2020 3:59 AM GMT
నాన్నా.. అంటూ ట‌చ్ చేసిన సూప‌ర్ స్టార్!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ 76 వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులు సినీ పరిశ్రమ శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. న‌ట‌శేఖ‌రుని వార‌సుడు సూప‌ర్ స్టార్ మహేష్ ట్విట్టర్ లో హత్తుకునే నోట్ ‌ను పోస్ట్ చేశారు.

``నేను ఉన్నంత‌లో బెస్ట్ గా ప్ర‌తిదీ ప్రయత్నిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. మై ఎవ‌‌ర్ గ్రీన్ సూపర్ స్టార్`` అంటూ భావోద్వేగ‌పూరిత‌మైన విషెస్ ‌తో ఆక‌ట్టుకున్నారు. నేటి ఉదయం కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మహేష్ కెరీర్ 27వ మూవీ అధికారికంగా లాంచ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ప్రీలుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. `సర్కార్ వారీ పాట` అనే టైటిల్ ని నేడు ప్ర‌క‌టించ‌నున్నార‌న్న స‌మాచారం ఉంది‌.

కృష్ణ పుట్టినరోజు అంటే ప్రతి ఏడాది అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈసారి అంత సంద‌డి లేదు. గ‌తేడాది ఆయ‌న‌ సతీమణి విజయనిర్మల మరణించడంతో కృష్ణ ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారీ విల‌యం వ‌ల్ల‌నూ.. అభిమానులు కూడా కృష్ణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం లేదు. అయితే మ‌హేష్ కొత్త సినిమా అధికారిక లాంచ్ స‌హా మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ కొత్త సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ రిలీజ్ కి ప్లాన్ చేశారు.

పార్లమెంట్‌ సభ్యుడు.. ప్రముఖ వ్యాపారవేత్త జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ - గల్లా అరుణ కుమారి సమర్పణలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. నేటి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు మ‌హేష్‌ మేన‌ల్లుడి కొత్త‌ లుక్ కి సంబంధించిన‌ పోస్ట‌ర్ రానుంది.