హడావుడి వద్దన్న మహేష్ బాబు

Sun May 31 2020 13:27:46 GMT+0530 (IST)

Mahesh babu Advice to Parasuram on About Sarkaru Vaari Paata Movie

నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మహేష్ బాబు 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. సినిమా టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు. సినిమా ప్రారంభోత్సవంను భారీగా నిర్వహించేందుకు మైత్రి మూవీస్ వారు మరియు 14 రీల్స్ వారు సన్నాహాలు చేశారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా కార్యక్రమం నిర్వహించడం వద్దని మహేష్ బాబు సూచించాడట.మహేష్ బాబు సూచన మేరకు అతి తక్కువ సభ్యులతో పూజా కార్యక్రమాు నిర్వహించారు. ఎప్పటిలాగే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా మహేష్ బాబు హాజరు కాలేదు. షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

గీత గోవిందం తర్వాత పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ సక్సెస్ కాంబో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.