Begin typing your search above and press return to search.

రూమ‌ర్‌ ల‌కి సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ రిప్లే అదిరింది

By:  Tupaki Desk   |   25 Sep 2021 5:30 AM GMT
రూమ‌ర్‌ ల‌కి సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ రిప్లే అదిరింది
X
క్రేజీ స్టార్‌ లు.. పాపుల‌ర్‌ హీరోలు ఈ మ‌ధ్య బ్రాండ్‌ ల‌కి ప్ర‌చార క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా మ‌న టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాలీవుడ్ హీరోల‌తో పోటీప‌డుతూ వారితో క‌లిసి క్రేజీ యాడ్‌ల‌తో ర‌చ్చ లేపు తున్నారు. హాలీవుడ్ హీరో త‌ర‌హా లుక్‌తో మ‌హేష్ బాలీవుడ్ హీరోల‌ని క‌మ‌ర్ష‌యిల్ యాడ్స్‌లో డామినేట్ చేస్తుండ‌టం విశేషం.

ఇదిలా వుంటే గ‌త కొంత కాలంగా న‌మ్ర‌త కార‌ణంగానే మ‌హేష్ యాడ్ ఫిల్మ్స్‌లో న‌టిస్తున్నాడంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ వార్త‌ల‌పై తాజాగా మ‌హేష్ స్మార్ట్‌గా రిప్లై ఇచ్చాడు. తాజా గా ఓ యాడ్ క‌మ‌ర్షియ‌ల్ ప్రెస్ మీట్ కోసం మీడియా ముందుకు వ‌చ్చిన మ‌హేష్ ప‌లువురు అడిగిన ప్ర‌శ్న‌కు అదిరిపోయే స‌మాధానం చెప్పాడు. నేను క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్‌ల‌ని ఎంచుకుని ఫైన‌ల్ చేస్తాను. ఆ త‌రువాత న‌మ్ర‌త వాటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల్ని చూసుకుంటుంది` అని స‌మాధానం చెప్పి రూమ‌ర్‌ల‌కి చెక్ పెట్టాడు.

అంతే కాకుండా వెబ్ సిరీస్‌ల గురించి కూడా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. వెబ్ సిరీస్ చూడ‌టానికి అమితంగా ఇష్ట‌ప‌డ‌తాను. అయితే అందులో న‌టించాల‌నే ఆలోచ‌న మాత్రం నాకు ఇంత వ‌ర‌కు లేదు. భ‌విష్య‌త్తులో న‌టిస్తానేమో ఇప్పుడే చెప్ప‌లేను. ఇక త‌ను న‌టిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్న‌ట్టు తెలిపారు మ‌హేష్‌.