Begin typing your search above and press return to search.

మహేష్‌ కూడా ఫిక్స్‌ అయ్యాడు

By:  Tupaki Desk   |   19 Jun 2021 4:30 PM GMT
మహేష్‌ కూడా ఫిక్స్‌ అయ్యాడు
X
కరోనా సెకండ్‌ వేవ్‌ తో మార్చి నుండి నిలిచి పోయిన షూటింగ్‌ లను మెల్ల మెల్లగా పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని సినిమా లను జూన్‌ చివరి వారం నుండే మొదలు పెట్టబోతున్నారు. మిగిలిన సినిమాలు అన్ని కూడా జులై లో షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు. జులైలో పునః ప్రారంభం కాబోతున్న సినిమాల జాబితాలో మహేష్‌ బాబు సర్కారు వారి పాట కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. దర్శకుడు సర్కారు వారి పాట సెకండ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్న సమయంలోనే కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలై షూటింగ్‌ నిలిచి పోయింది.

సెకండ్‌ షెడ్యూల్‌ ను హైదరాబాద్‌ లోనే మహేష్‌ బాబు నిర్వహించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో లాక్ డౌన్ ను ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో మళ్లీ షూటింగ్‌ ల హడావుడి మొదలు అవ్వబోతుంది. సర్కారు వారి పాటకు సంబంధించిన సెట్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయని టీమ్‌ మెంబర్స్ చెబుతున్నారు. దుబాయిలో జరిగిన షూటింగ్‌ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు. సెకండ్‌ షెడ్యూల్‌ లో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలతో పాటు రెండు పాటల చిత్రీకరణ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది.

జులై రెండవ వారంలో సర్కారు వారి పాట రెండవ షెడ్యూల్‌ ప్రారంభిస్తే ఆగస్టు వరకు ఆ షెడ్యూల్‌ ను నిర్వహిస్తారు. సర్కారు వారి పాట సినిమా తోనే మహేష్‌ బాబు.. త్రివిక్రమ్‌ మూవీని కూడా చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా ప్రారంభించబోతున్నారు. సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతుండగా.. త్రివిక్రమ్‌ మూవీని వచ్చే సమ్మర్ లో విడుదల చేస్తామని అంటున్నారు.