మహేష్ బాబు వర్సెస్ జగపతిబాబు

Tue Jan 24 2023 15:18:53 GMT+0530 (India Standard Time)

Mahesh Vs Jagapathi Babu in SSMB28 Film

కొన్ని కాంబినేషన్ లు రిపీట్ అవుతున్నా చూడ్డానికి ఆసక్తిగా వుంటుంది. అలాంటి కాంబినేషనే సూపర్ స్టార్ మహేష్ బాబు జగపతిబాబు. కొన్నేళ్ల క్రితం విడుదలైన 'శ్రీమంతుడు' మూవీలో తండ్రీ కొడుకులుగా నటించి ఆకట్టుకున్న ఈ ఇద్దరు ఆ తరువాత 'మహర్షి'లో ప్రత్యర్థులుగా కనిపించి అంతే ఇంపాక్ట్ ని కలిగించారు. ఈ మూవీతో మరో సూపర్ హిట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. తండ్రిగా పాజిటివ్ పాత్రలో నటించిన 'శ్రీమంతుడు' సూపర్ హిట్ కాగా.. ఆ తరువాత ఇద్దరు కలిసి నువ్వా నేనా అనే స్థాయిలో చేసిన 'మహర్షి'తోనూ మరో సక్సెస్ ని సొంతం చేసుకున్నారు.ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ముచ్చటగా మూడవ సారి రిపీట్ కాబోతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో దాదాపు పుష్కర కాలం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్నఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే సైలెంట్ గా మొదలైంది.

గత కొన్ని నెలలుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో షూటింగ్ మొదలైనా మహేష్ అభ్యంతరం చెప్పడం ముందు అనుకున్న స్టోరీ మారడంతో ఫ్రెష్ స్టోరీతో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగతోంది. ఇందులో పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తుండగా కీలక పాత్రలో ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ పాత్రలో జగ్గూభాయ్ జగపతిబాబు నటిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలో వున్న సారథీ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. రామ్ లక్ష్మణ్ ల నేతృత్వంలో పలు యాక్షన్ గట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నారు. సినిమాలో మహేష్ .. జగపతిబాబు క్యారెక్టర్లు నువ్వా నేనా అనే స్థాయిలో వుంటాయని తెలుస్తోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అరవింద సమేత'లో జగపతిబాబు బసిరెడ్డిగా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

మరోసారి అంతకు మించి SSMB28లో జగపతిబాబు క్యారెక్టర్ ని త్రివిక్రమ్ డిజైన్ చేశారట. ఆ కారణంగానే ఆ క్యారెక్టర్ కోసం మిగతా వాళ్లని అనుకున్నా ఫైనల్ గా జ.గపతిబాబునే ఫైనల్ చేసుకున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఇదిలా ఇప్పటికే చాలా ఆలస్యంగా పట్టాలెక్కిన ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్  చేస్తున్నరట. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.