మహేష్ ట్వీట్ 'మేజర్' జనాల్ని థియేటర్స్ కి రప్పిస్తుందా..?

Sat Mar 28 2020 21:15:28 GMT+0530 (IST)

Mahesh Tweet On 'Major' Movie Will Help?

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోలు నిర్మాతలు అంటూ సపరేట్ గా లేరు. హీరోలే నిర్మాతలు నిర్మాతలే హీరోలు అంతే. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలు నిర్మాతల అవతారం ఎత్తారు. టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఈయన జిఎంబి ప్రొడక్షన్స్ మొదలుపెట్టి అందులో సినిమాలు నిర్మిస్తున్నాడు. తను నటించే ప్రతి సినిమాలో భాగస్వామిగా ఉంటున్నాడు. ఈ మధ్య రిలీజై ఘన విజయం సాధించిన 'సరిలేరు నీకెవ్వరు' కూడా ఇలా వచ్చిందే. పారితోషికం బదులుగా ఆయన నిర్మాణంలో భాగం అవుతున్నాడు. అయితే ఇప్పుడు మహేష్ బాబు బయట హీరోతో కూడా సినిమా నిర్మిస్తున్నాడు.జిఎంబి ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అడవి శేష్ హీరోగా 'మేజర్' సినిమాను కూడా నిర్మిస్తున్నాడు మహేష్ బాబు. ఈ నిర్మాణ బాధ్యతలన్నీ నమ్రత చూసుకుంటుంది. ఇదిలావుండగా ఈ సినిమాను 9 కోట్లతో తీస్తానని అడవి శేషు నమ్రత దగ్గర ప్యాకేజీ మాట్లాడుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా ఉన్నట్లు కూడా చాలా మంది సినీ అభిమానులకు కూడా తెలియదు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. మరి ఇలా సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే ఎవరికి తెలుస్తుంది. మహేష్ బాబు ఒక ట్వీట్ చేసినంత మాత్రాన అడవి శేష్ ని చూసి జనాలు థియేటర్స్ కి వస్తారా..? ఎలాంటి అప్డేట్ లేకుండా మూవీ రెడీ చేసి థియేటర్స్ లో వదిలి తర్వాత ఒపింగ్స్ రాక తర్వాత బాధ పడటం షరా మామూలే. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో షూటింగ్ ఆపుకున్న 'మేజర్' మూవీ అప్డేట్ త్వరలోనే వస్తుందేమో చూడాలి.