Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ పెట్ తో మ‌హేష్ టైంపాస్!

By:  Tupaki Desk   |   12 Feb 2022 10:34 AM GMT
బ్లాక్ అండ్ వైట్ పెట్ తో మ‌హేష్ టైంపాస్!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ఖాళీ స‌మ‌యం దొరికితే ఫ్యామిలీతో ఇంట్లోనే స‌మ‌యం గ‌డుపుతారు. గౌత‌మ్..సితార‌ల‌తో క‌లిసి ప‌న్ని మూవ్ మెంట్స్ లోకి వెళ్లిపోతారు. తాజాగా మ‌హేష్ మ‌రోసారి కుమారుడు..కుమార్తెతో క‌లిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈసారి గౌత‌మ్..సితార‌తో పాటు బ్లాక్ వైట్ పెట్ కూడా ఉంది. మ‌హేష్ చైర్ లో కూర్చుని పెట్ త‌ల‌పై పై చేయి వేసు నెమురతున్నారు. ఇరు ప్ర‌క్క‌లా గౌత‌మ్..సితార నుంచొని ఉన్నారు.

ఈ ఫోటోలో మ‌హేష్‌ వైట్ టీష‌ర్ట్...బ్లూ డెనిమ్ జీన్స్ ధ‌రించారు. పిల్ల‌లు ఇద్ద‌రు పెద్ద‌వాళ్లు అవుతుండ‌టంతో మ‌హేష్ ఇలా ల‌వ్ బుల్ పెట్ తో ఆడుకుంటున్న‌ట్లు తెలుస్తుంది.

ఈ ఫోటోని న‌మ్ర‌త ఇన్ స్టా గ్రామ్ లో అభిమానుల‌కు షేర్ చేసారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు మ‌హేష్ ని ఇలా స‌ర‌దాగా గ‌డుపుతోన్న మూవ్ మెంట్స్ చూసి సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఇక మహేష్

సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే `స‌ర్కారు వారి పాట` షూటింగ్ పూర్తిచేసారు. ప్ర‌స్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఏప్రిల్ లో చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. మ‌హేష్ త‌దుప‌రి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రం షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఇప్ప‌టికే స్ర్కిప్ట్ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసి టీమ్ రెడీగా ఉంది.

తొలి షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేసారు. అలాగే ఇటీవ‌లే మ‌హేష్ ఏపీ లో టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో జ‌రిగిన భేటీకి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌ త‌రుపున తాను చెప్పాల‌నుకున్నది స్వ‌యంగా ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. క‌రోనా మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి సినిమా ఇండ‌స్ర్టీ ఎదుర్కోంటున్న ఇబ్బందుల గురించి ప్ర‌స్తావించ‌డం జ‌రిగింది. ఇలాంటి సినిమా రాజ‌కీయ భేటీకి మ‌హేష్ హాజ‌ర‌వ్వ‌డం ఇదే తొలిసారి.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో సూప‌ర్ స్టార్ కృష్ణ కి మంచి అనుబంధం ఉంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాం నుంచి కృష్ణ కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారుడిగా ఉన్న సంగ‌తి తెలిసిందే.