'అఖండ' సక్సెస్ మీట్ లో మహేష్ -తారక్

Sun Dec 05 2021 14:04:03 GMT+0530 (IST)

Mahesh Tarak at the Akhanda Success Meet

నటసింహా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన `అఖండ` ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ జోడీ తమదైన హవా సాగించారు. యూనిక్ మాస్ హిట్ తో హ్యాట్రిక్ కొట్టారు. బాలయ్య శైలి యాక్షన్  పంచ్ డైలాగులు..బోయపాటి స్టైల్ మేకింగ్ తో  ఫ్యాన్స్ కి పునకాలు తెప్పిస్తోంది ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. క్రిటిక్స్ పరంగా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ  సినిమా పై ఆ ప్రభావం అంతగా పడలేదు. బాలయ్య ఇమేజ్ కి బాక్సాఫీస్ షేక్ అవుతుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. `సింహా`..`లెజెండ్` తర్వాత `అఖండ`తో ఈ జోడీ హ్యాట్రిక్ ఖాయమైందని సన్నివేశం చెబుతోంది.తాజాగా ఈ సినిమా విజయోత్సవ వేడుకును హైదరాబాద్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈనెల 8న ఈవెంట్ జరగనుంది. మరి ఇంత పెద్ద సక్సెస్ ని  బిగ్ స్టార్స్ మధ్య సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? అందుకు...బాలయ్య  కోసం సూపర్ స్టార్  మహేష్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారుట.  మరి వీరిద్దర్నీ ఆహ్వనించింది బోయపాటి శ్రీను లేదా బాలయ్యనా అన్నది తేలాలి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా గురించి  ప్రశంసిస్తూ  మహేష్ కూడా ట్వీట్ చేసారు. అలాగే ఎన్టీఆర్ కూడా బాబాయ్ దెబ్బకి బాక్సాఫీస్ కి బీటలే అన్నంతగా రియాక్ట్ అయ్యారు.

కాబట్టి `అఖండ` సక్సెస్ లో పాలు పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ హాజరైతే బాలయ్య గురించి పబ్లిక్ వేదికపై  మహేష్ ఎలా మాట్లాడుతారు? అన్నది అప్పుడే హాట్ టాపిక్ గా మారుతోంది. త్వరలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకొస్తారని టీడీపీ కొమ్ము కాస్తారని ప్రచారం సాగుతున్న వేళ బాబాయ్ బాలకృష్ణతో కలిసి తారక్ ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా వేచి చూడాలన్న ఆసక్తి ఉంది. `రోరింగ్  బ్లాక్ బస్టర్` అంటూ `అఖండ` టీమ్ పోస్టర్లతో  సోషల్ మీడియాలో  దంచేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.