దుబాయ్ లో వేలం మొదలెట్టేసిన సర్కార్ వారు..!!

Mon Jan 25 2021 12:12:41 GMT+0530 (IST)

Mahesh's Sarkaru Vaari Paata Shoot Begins In Dubai

ఎట్టకేలకు దుబాయ్ లో వేలం మొదలైంది. సర్కార్ వారు బరిలో దిగి చర్యలు మొదలెట్టేశారు. ఈ విషయాన్ని అంతే ఫన్నీగా ప్రకటించింది 14రీల్స్ ప్లస్ బ్యానర్. ఆ మేరకు ట్వీట్ ని షురూ చేసింది. షూటింగ్ బిగిన్స్ అంటూ మోషన్ టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.
 
సూపర్ స్టార్ మహేష్ అభిమానులందరికీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ డేట్ ఇది. `సర్కారు వారి పాట` షూటింగ్ చాలా వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రారంభమవుతోంది. “వేలం అలాగే చర్య ప్రారంభమవుతుంది. # సర్కార్ వారి పాట షురూ.. ” అని 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది.దుబాయ్ లో ఒక నెల రోజుల షెడ్యూల్ తెరకెక్కించనున్నారు. ఆ తరువాత చిత్ర బృందం మరొక షెడ్యూల్ కోసం హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తుంది. తాజా షెడ్యూల్ లో మహేష్- కీర్తి సురేష్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు- జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఇండస్ట్రీ బెస్ట్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.