మహేష్ - రాజమౌళి.. మూడేళ్ళు అగాల్సిందేనా?

Wed Jun 29 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

Mahesh Rajmouli Movie Update

దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా తర్వాత ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అనే విషయంలో అంచనాలు అయితే మామూలుగా లేవు. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన సినిమాలను అభిమానించే వారు తదుపరి సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు. మహేష్ బాబుతో సినిమా ఫిక్స్ అయ్యింది అని తెలియగానే అంచనాలు మరింత పెరిగాయి. ఇదివరకే ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని రచయితకే విజయేంద్రప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చారు.కానీ ఇంకా ఆ కథ విషయంలో రాజమౌళి ఒప్పుకున్నాడా లేదా అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ తప్పకుండా  RRR సినిమా కంటే భారీ స్థాయిలోనే ఆ సినిమా ఉండబోతోంది అని నమ్మకంగా తెలియజేశారు.

ఇక రాజమౌళి చాలా రోజుల తర్వాత తన సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ చేయడంతో అది మహేష్ బాబు సినిమా కోసం అని అర్థమవుతుంది. రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి 'యూనిట్ ఇమేజ్' అనే ఒక ప్రముఖ 3D యానిమేషన్ VFX స్టూడియో సంస్థను కలిశాడు.

ఫ్రాన్స్ కు చెందిన ఆ కంపెనీలో ఇదివరకే చాలా పెద్ద యానిమేటెడ్ సినిమాలు గ్రాఫిక్ సినిమాలో వచ్చాయి. ఇక ఇప్పుడు రాజమౌళి తన సినిమాలకు VFX సూపర్వైజర్ గా పని చేసే కమల్ కన్నన్ తో వెళ్లి సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా కలిశాడు  వారితో నెక్స్ట్ వర్క్ చేయబోతున్నట్లు చెబుతూ ప్రత్యేకంగా ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అయితే రాజమౌళి వెళుతున్న విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే మహేష్ బాబు సినిమా కోసం దాదాపు మూడేళ్ల వరకు సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అయితే స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో దర్శకుడు రాజమౌళి చాలా బిజీగా ఉన్నాడు. ఇక మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది రాజమౌళి తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

2023 లో షూటింగ్ మొదలు పెట్టి ఏడాదిన్నర వరకు షూటింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం ఒక ఏడాది సమయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అటూ ఇటూ గా చూసుకుంటే ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది.