సర్కారు పాటకు కుదేలైన పాత రికార్డ్స్..!

Mon Jun 01 2020 20:30:21 GMT+0530 (IST)

Sarkaru vari pata cleared old records

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరూ తర్వాత ఆయన చేస్తున్న తాజా సినిమా 'సర్కారు వారి పాట'. ఈ అప్ కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట' పై అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ 27వ సినిమా అధికారిక ప్రకటనతో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు యూనిట్ వర్గాలు. ఈ సినిమాకు చాలా డిఫెరెంట్ గా.. కొత్తగా “సర్కారు వారి పాట” అంటూ యూనిక్ టైటిల్ విడుదల చేయగానే టైటిల్ కి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ప్రీ లుక్ లో మహేష్ న్యూ మేక్ ఓవర్ కూడా ఫ్యాన్స్ కి అల్టిమేట్ ఎనర్జీ ఇచ్చిందని చెప్పాలి. అలా టైటిల్ విడుదల చేశారో లేదో దేశవ్యాప్తంగా భారీ ట్రెండ్ ని సొంతం క్రియేట్ చేసింది.టాలీవుడ్ లో టైటిల్ ట్రెండ్స్ పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ పాత రికార్డులను బ్రేక్ చేసింది "సర్కారు వారి పాట". కేవలం 24 గంటల్లోనే ఇదివరకు పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' టైటిల్ పై ఉన్న 3.5 మిలియన్ ట్వీట్ల రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డు సృష్టించారు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు. కొత్తగా రిలీజ్ చేసిన ఊరమాస్ లుక్కులో మహేష్ టైటిల్.. 24 గంటల్లో 4.4 మిలియన్ల ట్వీట్లను సొంతం చేసుకుని టాప్ స్థానం కొట్టేసింది. అంతే సర్కారు వారి పాటకు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనే అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్ లో సరికొత్త రికార్డ్ నెలకొంది. ట్విట్టర్లో దుమ్మురేపుతున్న టైటిల్ ట్రెండ్ లో.. రాబోయే కొత్త సినిమాల టైటిల్స్ కి సరికొత్త టార్గెట్ సెట్ చేశారు మహేష్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో మోస్ట్ రీట్వీటెడ్.. మోస్ట్ లైక్స్.. పొందిన ఫస్ట్ లుక్ రికార్డును మహేష్ సొంతం చేసుకున్నట్లే లెక్క అంటున్నారు నెటిజన్లు.