'మహేష్ - ప్రశాంత్ నీల్' కాంబో.. ఆ కారణంగానే సెట్ కాలేదా..??

Thu Jun 10 2021 21:00:01 GMT+0530 (IST)

'Mahesh - Prashant Neel' combo .. Couldn't it be set for that reason .. ??

సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగించే సందర్భాలు చోటుచేసుకుంటాయి. ఓ అభిమాన హీరో మరో అభిమాన దర్శకుడి కాంబినేషన్ కుదరనప్పుడు అసలు ఫ్యాన్స్ ఎలా నిరాశకు గురవుతారో తెలిసిందే. అలా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సెట్ కాకపోతే కూడా అభిమానుల నుండి అదే రెస్పాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే మొన్నటివరకు కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో మహేష్ బాబు పలువురు దర్శకులు కథలు విన్నాడు.అయితే మహేష్ బాబును ఏ ఒక్క దర్శకుడు కూడా మెప్పించలేకపోయారు. ఆఖరికి మళ్లీ త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చేసరికి మహేష్ ఆ స్క్రిప్ట్ ఓకే చేసాడు. అయితే మొదటగా మహేష్ వద్దకు అందరిలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్క్రిప్ట్ తీసుకొని వచ్చాడట. అలాగే నేరేషన్ ఇచ్చిన తర్వాత మహేష్ ఎందుకో స్టోరీ కనెక్ట్ కాలేదని అనిపించి నో చెప్పేసాడని టాక్. మరి అదే డైరెక్టర్ ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి స్టోరీ లైన్ వినిపిస్తే వెంటనే ఓకే అయిపోయింది. ఇటీవలే అధికారిక ప్రకటన కూడా బయటికి వచ్చింది. మరి మహేష్ దగ్గర ఏం మిస్ అయింది.. ఎన్టీఆర్ దగ్గర ఏం ప్లస్ అయింది..? అంటూ సోషల్ మీడియాలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే మహేష్ తో ప్రశాంత్ స్టోరీ కనెక్ట్ కాకపోవడానికి కూడా పలు స్ట్రాంగ్ కారణాలు వినిపిస్తున్నాయి. ఏంటంటే.. ప్రశాంత్ నీల్ అంటే సినిమాలు పూర్తిగా హై లెవెల్ యాక్షన్ బేస్ చేసుకొని.. మాస్ అంశాలతో ఉంటాయని తెలిసిందే. అయితే అలాంటి మాస్ స్క్రిప్ట్ నేరేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని సన్నివేశాలలో విజువల్స్ అసాధ్యం అనిపించవచ్చు. అందులోను మహేష్ రఫ్ లుక్కులో ఇప్పటివరకు మాస్ యాక్షన్ సినిమా చేయలేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా స్క్రిప్ట్ లో ఎలివేషన్ సీన్స్ నమ్మకం కలిగించే అవకాశం తక్కువ. సో మహేష్ నో చెప్పడానికి ఇది కూడా ఓ కారణం అయ్యుండొచ్చు అని టాక్ నడుస్తుంది. ఏదైతేనేం మొత్తానికి ఈ కాంబినేషన్ సెట్ కాలేదని ఫ్యాన్స్ అయితే కాస్త నిరాశగానే ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా రూపొందిస్తున్నాడు.