Begin typing your search above and press return to search.

మహేష్ పోకిరి హవా.. దిమ్మతిరిగే బుకింగ్స్!

By:  Tupaki Desk   |   8 Aug 2022 10:07 AM GMT
మహేష్ పోకిరి హవా.. దిమ్మతిరిగే బుకింగ్స్!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ మరోసారి పోకిరి సినిమా రుజువు చేస్తోంది. ఈ సినిమా వచ్చి చాలా కాలం అయినప్పటికీ కూడా అభిమానులలో మాత్రం జోష్ ఏమాత్రం తగ్గలేదు. అని చెప్పవచ్చు.

ఎన్నోసార్లు టీవీల్లో వచ్చినా ప్రస్తుతం యూట్యూబ్ లో ఫుల్ సినిమా ఉన్నప్పటికీ కూడా మళ్లీ థియేటర్లో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది ఏదో ప్రత్యేకమైన కొన్ని సెంటర్లలో షోలను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సారి మాత్రం పోకిరి సినిమాను ఊహించని రేంజ్ లో ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. అసలైతే మొదట హైదరాబాద్లో కేవలం 12 స్క్రీన్లలో మాత్రమే పోకిరి సినిమాను ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ అభిమానుల నుంచి డిమాండ్ ఊహించిన దానికంటే ఎక్కువగా రావడంతో ఇప్పుడు ప్రత్యేకంగా షో ల సంఖ్య పెంచాల్సి వచ్చింది. మొత్తంగా మహేష్ పుట్టిన రోజు నాడు 150 షోల వరకు ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఓవర్సీస్లో కూడా 17 లొకేషన్లలో 24 షోలు ప్రదర్శించబోతున్నారు. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 11 వేల డాలర్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో దాదాపు 30 షోలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా పోకిరి సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో రెండవ సారి ఒక సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది.

అయితే ఈ వచ్చిన కలెక్షన్స్ తో ఒక మంచి పని కోసం ఉపయోగించబోతున్నారు. మహేష్ బాబు తన ద్వారా ఎంతో మంది చిన్నారులు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే ఎంతో మంది చిన్నారులకు మహేష్ బాబు ప్రత్యేకంగా సర్జరీలు కూడా చేయించాడు. అయితే ఇప్పుడు పోకిరి సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్స్ అన్నిటిని కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ మహేష్ బాబు ట్రస్ట్ కోసం అంధించబోతున్నట్లు సమాచారం. మరి మహేష్ బాబు ఈ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.