Begin typing your search above and press return to search.

స‌ర్వే.. టాప్ 10 జాబితాలో మ‌హేష్ నంబ‌ర్-1

By:  Tupaki Desk   |   15 Oct 2021 1:30 AM GMT
స‌ర్వే.. టాప్ 10 జాబితాలో మ‌హేష్ నంబ‌ర్-1
X
టాలీవుడ్ హీరోల పాపులారిటీని స‌ర్వే చేస్తూ ప్ర‌తి నెలా రిపోర్టులు అందిస్తోంది ఒక ప్ర‌ముఖ‌ మీడియా సంస్థ‌. జూన్ - జూలై- ఆగ‌స్ట్ రిపోర్టుల్ని ఇప్పటికే ఈ సంస్థ అందించింది. ప్ర‌తిసారీ మ‌హేష్ నంబ‌ర్ -1 స్థానంలో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి కూడా సెప్టెంబ‌ర్ మాసానికి ఆయ‌నే నంబ‌ర్ -1. ఆ త‌రవాత అల్లు అర్జున్ రెండో స్థానంలో నిలిచారు.

మ‌హేష్ .. అల్లు అర్జున్ కొంత కాలంగా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు.. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల‌తో పోటీ ప‌డిన ఆ ఇద్ద‌రూ గూగుల్ ట్రెండ్స్ లో నిలిచారు. ఆ త‌ర్వాతా ఆ ఛ‌రిష్మాని కొన‌సాగిస్తున్నారు. మ‌హేష్ ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట‌లో న‌టిస్తుండ‌గా.. బ‌న్ని పుష్ప‌-1లో న‌టిస్తూ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారారు. త‌దుప‌రి క్రేజీ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసేందుకు ఆ ఇద్ద‌రూ సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్స్ లో ఇది డిబేట్ గా మారింది.

ఆ త‌ర్వాత ప్ర‌భాస్ మూడో స్థానంలో నిల‌వ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ నాలుగో స్థానంలో ఉన్నారు. సాహో త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గానే అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌కు ప్ర‌భాస్ క‌మిట‌య్యారు. ఆదిపురుష్ 3డి- స‌లార్ చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌వుతున్నాయి. ఇత‌ర సినిమాల షెడ్యూల్స్ కి ప్లానింగ్ సాగుతోంది. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ తో కంబ్యాక్ అయ్యాక భీమ్లా నాయ‌క్ - హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. వ‌రుస‌గా నలుగురు ద‌ర్శ‌కులు ప‌వన్ క్యూలో ఉన్నారు. వ‌రుస సినిమాల‌తో నిరంత‌రం ఆ ఇద్ద‌రూ వార్త‌ల్లో నిలుస్తున్నారు.

ఎన్టీఆర్ ఐదో స్థానంలో నిల‌వ‌గా నాని ఆరో స్థానంలో నిలిచారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ ముగించి కొర‌టాల‌తో ప్రాజెక్టు చేస్తున్నారు. అలాగే నాని ట‌క్ జ‌గ‌దీష్ త‌ర్వాత శ్యామ్ సింఘ‌రాయ్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల వివాదాల్లో నాని పేరు ట్రెండ్ అయిన సంగ‌తి విధిత‌మే. నాని ఈసారి ఈ స‌ర్వేలో ఒక స్థానం మెరుగ‌య్యారు. ఇక ఏడో స్థానంలో రామ్ చ‌ర‌ణ్‌.. ఎనిమిదో స్థానంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నారు. విన‌య విధేయ రామ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ - ఆచార్య చిత్రాల‌తో చ‌ర‌ణ్ బిజీ అయ్యారు. ఈ రెండు చిత్రాలు నెల గ్యాప్ తోనే 2022 లో విడుద‌ల కానున్నాయి. దేవ‌ర‌కొండ ఈసారి ఎనిమదవ స్థానానికి దిగజారారు. గత నెలలో ఏడవ స్థానంలో నిలిచారు. వరల్డ్ ఫేమస్ లవర్ త‌ర్వాత పూరీతో లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక తొమ్మిదో స్థానంలో మెగాస్టార్ చిరంజీవి.. ప‌దో స్థానంలో నాగ‌చైత‌న్య నిలిచారు. సైరా త‌ర్వాత చిరు దూకుడు పెంచారు. వ‌రుస‌గా నాలుగైదు చిత్రాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. నాగ‌చైత‌న్య ల‌వ్ స్టోరితో విజ‌యం అందుకున్నారు. ఇక చైత‌న్య పేరు విడాకుల టాపిక్ తో హాట్ టాపిక్ అయ్యింది. అలాగే క‌థానాయిక‌ల్లో స‌మంత పేరు మార్మోగుతోంది. గ‌త నెల‌లో లానే ఈసారి కూడా త‌నే ఈ స‌ర్వేలో నంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2లో న‌ట‌న‌తో పాటు విడాకుల ఫ‌ర్వం కూడా సామ్ ని వార్త‌ల్లో నిలిపింది.