మహేష్ 27 గ్యాంగ్ స్టర్ కథతో

Thu Dec 05 2019 15:56:47 GMT+0530 (IST)

Mahesh Next Movie Will Be Gangstar Story

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన `మహర్షి` బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ 25వ చిత్రమిది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు మహేష్. ఆ తర్వాత మహేష్ ఎవరితో పని చేస్తారు? అన్నదానిపై పూర్తి క్లారిటీ రాలేదు. సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ అయ్యాక సరిలేరు చిత్రీకరణలో మహేష్ బిజీ అయ్యారు. అయితే మహర్షి టైమ్ లోనే వంశీ పైడిపల్లికి మహేష్ మరో కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పైడిపల్లి ఆ సినిమా పనిలోనే ఉన్నారు. మహేష్ కోసం స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. అయితే పైడిపల్లి స్క్రిప్టు ఫైనల్ అయ్యిందా లేదా? అన్నదానిపై ఇప్పటివరకూ ఏ క్లారిటీ లేదు. మహేష్ కానీ పైడిపల్లి కానీ ఇప్పటివరకూ ఎక్కడా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం రివీల్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ లో బోలెడంత సందిగ్ధత నెలకొంది. అయితే అన్ని ప్రశ్నలకు తాజాగా ఆన్సర్ వచ్చేసింది.

ఎట్టకేలకు మహేష్ నటించే తదుపరి  27వ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పైడిపల్లి స్వయంగా వెల్లడించారు. ఈ బుధవారం వైజాగ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ మహేష్ తోనే తన తదుపరి చిత్రం ఉండనుందని ప్రకటించారు. అంతేకాదు మహర్షి నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందట. ఇక ఈ చిత్రంలో మహేష్ ఎలాంటి పాత్రలో నటిస్తారు? అన్నదానికి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఈసారి మహేష్ ని ఒక గ్యాంగ్ స్టర్ గా చూపించేందుకు వంశీ పైడిపల్లి స్క్రిప్టును డెవలప్ చేస్తున్నారట.