Begin typing your search above and press return to search.

షాకింగ్: చిరు 152 నుంచి చ‌ర‌ణ్ ఔట్

By:  Tupaki Desk   |   19 Feb 2020 5:00 AM GMT
షాకింగ్: చిరు 152 నుంచి చ‌ర‌ణ్ ఔట్
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ 152వ చిత్రం `ఆచార్య‌` షూటింగ్ శ‌రవేగంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మెగాభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమాని సోషియో పొలిటికల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ లో చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారన్న వార్త ఇటీవ‌ల‌ హాట్ టాపిక్ అయింది. న‌క్స‌లైట్ పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగింది. దీంతో మెగా అభిమానుల్లో జోష్ క‌ట్ట‌లు తెంచుకుంది. త‌మ అభిమాన హీరోలిద్ద‌రినీ మ‌రోసారి ఒకే ప్రేమ్ లో చూసుకునే భాగ్యం క‌లుగుతోంద‌ని సంతోషం వ్య‌క్తం చేసారు.

ఈ కాంబినేష‌న్ అన‌గానే అంచ‌నాలు స్కైని ట‌చ్ చేసాయి. అయితే ఇంత‌లోనే ఊహించ‌ని షాక్ తినాల్సి వ‌స్తుంద‌న్న‌ది ఫ్యాన్స్ ఊహించ‌లేక‌పోయారు. తాజాగా చిరు 152 నుంచి చ‌ర‌ణ్‌ త‌ప్పుకున్నారని తెలుస్తోంది. అయితే ఇంత‌లోనే స‌డెన్ డెసిష‌న్ తీసుకోవడానికి కార‌ణం ఏమిటి? అంటే .. రాజ‌మౌళికి ఇచ్చిన మాట ప్ర‌కారం చ‌ర‌ణ్ త‌ప్పుకోక త‌ప్ప‌లేద‌న్న క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ `ఆర్.ఆర్.ఆర్` పూర్త‌య్యే వ‌ర‌కూ చ‌ర‌ణ్ మ‌రో సినిమాకి కాల్షీట్లు కేటాయించొద్ద‌నేది జ‌క్క‌న్న కండీష‌న్. ఆ నియ‌మం ప్ర‌కార‌మే చ‌ర‌ణ్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ పూర్త‌యి రిలీజ‌య్యాకే చ‌ర‌ణ్ న‌టించిన ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వాల‌న్న‌ది మ‌రో కండీష‌న్.

కొరటాల‌కు కాల్షీట్లు కేటాయించాల‌న్నా .. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్‌ త‌ర్వాత‌నే పాజిబుల్. కానీ అప్ప‌టివ‌ర‌కూ కొర‌టాల వెయిట్ చేసే సీన్ క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే మెగాస్టార్ కోసం ఏకంగా రెండేళ్లు వెయిట్ చేసారు. చ‌ర‌ణ్ కోసం మ‌రో ఏడాది వెయిట్ చేయ‌డం అంటే త‌న‌కి ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. ఇదే డాడ్ సినిమా నుంచి చ‌ర‌ణ్ త‌ప్పుకోవ‌డానికి కార‌ణ‌మ‌ని స‌మాచారం. మ‌రి ఇప్పుడు ఆ పాత్ర‌ను టాలీవుడ్ లో ఏ స్టార్ చేస్తారు? అంటే ఇద్ద‌రు టాప్ స్టార్లు ఆస‌క్తిగా ఉన్నార‌న్న మ‌రో ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. అందులో ఒక‌రు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాగా.. మ‌రొక‌రు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆస‌క్తిగా ఉన్నార‌ని తెలిసింది. చిరు 152లో జాక్ పాట్ ఎవ‌రిని వ‌రిస్తుంది? అన్న‌ది వేచి చూడాలి.