లేడీ గూఢచారిపై మహేష్ ఫ్యాన్స్ గుస్సా

Wed Aug 08 2018 15:57:37 GMT+0530 (IST)

Mahesh Fans Trolled And Abused Shobitha Dhulipala


సౌత్ లో స్టార్ హీరోల అభిమానులు  - వాళ్ళ విపరీతమైన అభిమానం.. అప్పుడప్పుడు అవి శృతి మించడం అందరికీ తెలిసిన విషయాలే.  ఒక్కో సారి అభిమానుల ప్రవర్తన చాలామందికి చికాకు తెప్పిస్తుంది కూడా.   ఈమధ్య 'గూఢచారి' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ కు మహేష్ ఫ్యాన్స్ నుండి అలాంటి హీటే తగిలింది.  'గూఢచారి' సినిమాను అందరూ ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే.  సూపర్ స్టార్ మహేష్ బాబు 'గూఢచారి' సినిమాను చూడడమే కాకుండా ట్విట్టర్ ద్వారా 'గూఢచారి' టీమ్ పై ప్రశంసల  జల్లు కురిపించాడు. ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ శోభిత 'థ్యాంక్ యు' అని చెప్పింది.  అంతే.. మహేష్ డై హార్డ్ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది.  థ్యాంక్స్ అలా చెప్తారా.. రెస్పెక్ట్ ఎక్కడ? అంటూ శోభితను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.

వాళ్ళు చెప్పేదేంటంటే మహేష్ బాబు సర్ అనో - మహేష్ బాబు గారు అనో - లేదా సూపర్ స్టార్ అనో సంభోదించి థ్యాంక్ యూ చెప్పాలి కదా అని.  మరి శోభిత కర్టసీ తో 'థ్యాంక్ యూ' చెప్పడం కూడా మహేష్ ను గౌరవించినట్టే.  మరి ఈ వీరాభిమానులు ఎందుకు దాన్ని గమనించడం లేదో.   కారణం ఏదైనా ఇంకా ఈ ట్రోలింగ్ కొనసాగుతోంది.  ఈ ఎపిసోడ్ తో శోభితకు స్టార్ల ప్రస్తావన వచ్చినప్పుడు మరింత గౌరవంతో ట్వీట్ పెడుతుందేమో వేచి చూడాలి.