Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే ఎదురుకానుందా...?

By:  Tupaki Desk   |   23 May 2020 5:15 AM GMT
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే ఎదురుకానుందా...?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేష్. ఈ సినిమా వచ్చిన ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా మహేష్ తన తదుపరి సినిమా గురించి ప్రకటన చేయలేదు. నిజానికి మహేష్ 'సరిలేరు..' రిలీజైన వెంటనే తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన కుదరలేదు. అయితే మహేష్ తన కెరీర్లో 27వ చిత్రాన్ని 'గీత గోవిందం' డైరెక్టర్ పరశురామ్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ పరశురామ్ తన తదుపరి మూవీ సూపర్ స్టార్ మహేష్ తో అని ప్రకటించేశాడు. దీంతో ఎట్టకేలకు మహేష్ తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. అయితే మహేష్ తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న ఈ సినిమా అఫీసియల్ గా ప్రారంభించే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మహేష్ మే 31న తన సినిమాకి సంభందించి ఏదొక అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని న్యూస్ వచ్చింది. దీంతో అంభిమానులందరూ మే 31 కోసం ఆసక్తి గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మహేష్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే ఎదురుకానుందట. మే 31న మహేష్ తన నెక్స్ట్ మూవీ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదట. అంతేకాకుండా ఆ రోజు కృష్ణ గారి బర్త్ డే కూడా ఈసారి సెలెబ్రేట్ చేయడం లేదట. దీంతో ఫ్యాన్స్ ఇంకొన్ని రోజులు తమ అభిమాన హీరో నెక్స్ట్ మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేయక తప్పదు. అయితే ఇప్పుడు అప్డేట్ ఉందో లేదో అన్నది పక్కన పెడితే అసలు మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదా కదా అనే డౌట్స్ కొడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి దాకా మహేష్ - పరశురామ్ కాంబో గురించి అటు మహేష్ కానీ ఇటు ప్రొడక్షన్ హౌస్ గానీ ఎలాంటి ఆఫీసియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. పరశురామ్ కూడా తన నెక్స్ట్ మూవీ మహేష్ తో అని చెప్పాడు కానీ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఇదే అని చెప్పలేదు. ఈ నేపథ్యంలో మహేష్ నెక్స్ట్ సినిమా మీద ఇంకా క్లారిటీ రానట్లే అర్థం. ఇప్పటికైనా మహేష్ బాబు లేదా ప్రొడక్షన్ హౌస్ వారు ఒక ట్వీట్ చేసైనా ఈ సినిమాపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మహేష్ అండ్ టీమ్ దీనిపై స్పందించి ఫ్యాన్స్ కోరిక మీద నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్తారేమో చూడాలి.