మహేష్ బాబు 'బర్త్ డే' రోజు సర్ప్రైజ్ ఉండబోతుందా..?

Tue Aug 04 2020 23:55:41 GMT+0530 (IST)

Is there going to be a surprise on Mahesh Babu's 'birthday'?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే? మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సర్కారు పాటతో మహేష్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ - మహేష్ బాబుల కాంబినేషన్ ఖచ్చితంగా వెరైటీగా ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 'సర్కారు వారి పాట' అనే టైటిలే విపరీతంగా బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే ప్రేక్షకుల నుండి ఊహించని రేంజిలో స్పందన లభించింది. ఈ సినిమాకి సంబంధించి మహేష్ పోస్టర్ విడుదల కాగా ఇందులో మహేష్ లాంగ్ హెయిర్ లైట్ బియర్డ్ తో ఇంతక ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌లో కనిపించి కిక్ ఇచ్చాడు. ఇటీవలే ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అనే సందేహం అందరిలో ఉంది.అయితే ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో బ్యాంకు కుంభకోణం చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజున మహేష్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. మహేష్ కొత్త సినిమా సర్కారు వారి పాట నుండి చిన్న వాయిస్ ఓవర్ వీడియో(గ్లిమ్ప్స్) ఒకటి విడుదల చేయాలనీ దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. వాయిస్ తో పాటు వీడియో ద్వారా అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అలాగే ఫ్యాన్స్ కూడా ఏదొక అప్డేట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ సర్ప్రైజ్ మేకర్స్ రెడీ చేస్తున్నారేమో.. ఇక ఓ వైపు మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. మైత్రి మూవీస్ తో పాటు 14రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ నటిస్తుంది.