యూరప్ వీధుల్లో మహేష్ ఫ్యామిలీ చిలౌట్!

Sun May 29 2022 09:00:02 GMT+0530 (IST)

Mahesh Family in the streets of Europe!

సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ 'సర్కారు వారి పాట' విజయోత్సవాన్ని ముగించుకుని మరోసారి యూరప్  వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ట్రిప్ కి సంబంధించిన ఫోటోని మహేష్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులకు షేర్ చేసారు. నమ్రత...గౌతమ్..సితార..మహేష్ అంతా కలిసి దిగిన లో సెల్పీ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.మహేష్ కూలింగ్ గ్లాసెస్ ధరించి మరింత గ్లామర్ గా కనిపిస్తున్నారు. ఇక నమ్రత కూడా అద్దాలు ధరించడం గమనించవచ్చు. పిల్లలు ఇద్దరూ నవ్వుతూ క్యామ్ వైపు చూస్తున్నారు. మొత్తానికి మహష్ ఫ్యామిలీ యూరప్ వీధుల్ని చుట్టేస్తున్నారని తెలుస్తుంది. ఈ ఫోటోని ఉద్దేశించి అభిమానులు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

బ్యూటీఫుల్ ఫ్యామిలీ... లుకింగ్ గార్జియస్ అంటూ అభిమానం చాటుకుంటున్నారు. యూరప్ మహేష్ ఫ్యామిలీ ఫెవరెట్ వెకేషన్ స్పాట్. ఖాళీ సమయం దొరికితే కుటుంబంతో కలిసి యూరప్  విమానం ఎక్కేస్తారు. వారం రోజుల పాటు యూరప్ అందాల్లో మునిగి తేలుతారు. కొన్నేళ్లగా మహేష్ ఫ్యామిలీ ఎక్కువగా యూరప్ కే వెళ్తుంది.

అక్కడి అందమైన లొకేషన్లు చూడటానికి  ఎన్నిసార్లు వెళ్లిన సమయం సరిపోదని..అక్కడ ప్రెష్ ఫీల్ కల్గుతుందని మహేష్ అంటుంటారు. నమ్రత పిల్లలతో కలిసి వెళ్లినా ఎక్కువగా యూరప్ కే వెళ్తుంటారు.  బాగా తెలిసిన ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. అన్ని రకాల సౌకర్యాలు యూరప్ లో చక్కగా కుదురుతాయని అంటుంటారు.

సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ యూరప్ వెళ్లారు. కొన్ని రోజుల గడిపిన అనంతరం సినిమా ప్రమోషన్  కోసం తిరిగొచ్చేసారు.  మళ్లీ సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాత వెంట వెంటనే యూరప్ వెళ్లడం కూడా ఇదే తొలిసారి. మరికొద్ది రోజుల్లోనూ ఈ ట్రిప్ ముగిసే అవకాశం ఉంది.

యూరప్ నుంచి రాగానే మహేష్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్  మొదలవుతుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని మాటల మాంత్రికుడు రెడీగా ఉన్నారు. మహష్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కడం మూడవ సారి. గతంలో ఇదే కలయికలో  అతడు..ఖలేజా చిత్రాలు తెరకెక్కిన సంగతి  తెలిసిందే.

అతడు బ్లాక్ బస్టర్ అవ్వగా..ఖలేజా మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. అప్పటి నుంచి సినిమా చేయాలని పలుమార్లు అనుకున్నా అవ్వలేదు. ఎట్టకేలకు కొన్నేళ్ల  గ్యాప్ తర్వాత...మహేష్ గ్రాప్ మరింత పెరిగిన తర్వాత మళ్లీ ఆ కాంబోలో సినిమా మొదలవుతుంది. సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. టాలీవుడ్ హీరోల రేంజ్ పాన్ ఇండియాకి చేరుతున్న తరుణంలో  మహేష్ తో మాంత్రికుడు ఎలాంటి కంటెంట్ తో వస్తారు? అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తుంది.