ఒక నెల పాప ప్రాణాన్ని కాపాడిన మహేష్ బాబు

Thu Jan 13 2022 22:29:13 GMT+0530 (IST)

Mahesh Babu wins hearts for his noble work

మహేష్ బాబు మరోసారి తనది మంచు మనసు అని నిరూపించుకున్నారు. చిన్నారుల పాలిట కల్పతరువులా మారింది. ముఖ్యంగా గుండెజబ్బులు బారినపడి చిన్నారులను రక్షించడంలో ముందుంటున్నారు. ఆపద అని తెలిసిన చిన్నారులందరినీ మహేష్ బాబు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నారు.  చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్న మహేష్ బాబుని  నిజంగానే సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్‌లో చేరిన నెల శిశువు జీవితాన్ని మహేష్ తాజాగా రక్షించాడు. తల్లిదండ్రులతో పాటు శిశువు ఉన్న చిత్రాన్ని నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నిలకడగా ఉన్న పాపను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

గతంలో కూడా మహేష్ బాబు ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఆర్థికంగా లేనివారు.. పేద నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు జబ్బుల బారినపడితే ఆదుకుంటున్నారు. మహేష్ ఇప్పటిదాకా 1000 మందికి పైగా పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేశారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు హ్యాష్‌ట్యాగ్‌తో పాటు  MBForSavingHearts వైరల్ అయ్యింది.

ప్రస్తుతం మహేష్ బాబు కోవిడ్19 బారిన పడ్డాడు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. దుబాయ్ ట్రిప్‌లో నటుడికి వ్యాధి సోకినట్లు చెబుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాటలో' హీరోగా నటిస్తున్నాడు. మహేష్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ప్రస్తుతం షూటింగ్  ఆగిపోయింది. ఇది కాకుండా రాజమౌళి సినిమా కూడా మహేష్ బాబు చేయాల్సి ఉంది.