Begin typing your search above and press return to search.

మహేష్ చేతులు మీదుగా మేనల్లుడి సినిమా టైటిల్ - టీజర్..!

By:  Tupaki Desk   |   23 Jun 2021 6:10 AM GMT
మహేష్ చేతులు మీదుగా మేనల్లుడి సినిమా టైటిల్ - టీజర్..!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుండి మరో యువహీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు గల్లా అశోక్ కుమార్ టాలీవుడ్ హీరోగా డెబ్యూకు రెడీ అయిపోయాడు. మహేష్ బాబు మేనల్లుడుగా అశోక్ తన ఫస్ట్ సినిమా టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 'హీరో' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా సినిమా టైటిల్ తో పాటు టీజర్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్.

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడుగా ఆల్రెడీ అశోక్ ఇండస్ట్రీ దృష్టిలో పడిపోయాడు. ఇప్పుడు సినిమా కూడా రెడీ అవ్వడంతో అశోక్ పేరు టాలీవుడ్ ప్రేక్షకుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవలే లాక్ డౌన్ కూడా ముగియడంతో ఇండస్ట్రీలో అన్ని పనులు ప్రారంభం అవుతున్నాయి. అలాగే థియేటర్స్ కూడా త్వరలో ఓపెన్ కాబోతున్నాయి. ఈ సందర్బంగా మెల్లమెల్లగా ఒక్కో సినిమా నుండి హీరోలు మేకర్స్ తమ ప్రమోషన్స్ ప్రోగ్రాంస్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జూన్ 23న అంటే ఈరోజు తన మేనల్లుడు హీరోగా నటించిన సినిమా టైటిల్ తో పాటుగా టీజర్ కూడా రిలీజ్ చేయనున్నాడు.

సినిమా షూటింగ్ ఆల్రెడీ ముగింపు దశకు చేరుకుంది. నిజానికి థియేటర్స్ కూడా ఓపెన్ ఉండుంటే టైటిల్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేవారు అని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో అశోక్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అశోక్ డెబ్యూ సినిమాకి నిధి గ్లామర్ కలిసి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సినిమా నుండి రిలీజ్ చేసిన జూంబారే సాంగ్ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాను అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.