అమ్మమ్మ అన్నయ్య జ్ఞాపకాలు వీడనివి

Sun Jan 16 2022 18:10:08 GMT+0530 (IST)

Mahesh Babu taking a lengthy break from acting

బంధాలు అనుబంధాలకు విలువిచ్చే వారికి కొన్ని చాలా కాంప్లికేటెడ్. స్మృతుల నుంచి జ్ఞాపకాల దొంతరల నుంచి బయటపడడం అంత ఆషామాషీ కాదు. సూపర్ స్టార్ మహేష్ తాజా సన్నివేశంపైనా ఇండస్ట్రీ ఇన్ సైడ్ రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవలే అతడు తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన సోదరుడు రమేష్ బాబును కోల్పోయాడు. ఈ బాధ నుంచి అతడు తొందరగా బయటపడడం కుదరదని అభిమానుల్లో చర్చ సాగుతోంది. అన్నయ్య తనలో సగభాగం అంటూ మహేష్ ఆవేదన చెందిన సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో అతడు కడసారి చూపునకు నోచుకోలేదు. అది ఇంకా ఆవేదన కలిగించే అంశం.

ఇంతకుముందు కూడా అమ్మమ్మ చనిపోయినప్పుడు మహేష్ మామూలు మనిషి కావడానికి చాలా కాలం పట్టింది. అతిథి-2007 మూవీ సమయంలో అమ్మమ్మ చనిపోవడంతో కెరీర్ పీక్స్ లో ఉండీ మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకోవడం అభిమానులను కలవరపరిచింది. అంతటి ఎమోషనల్ బాండింగ్ తో ఉంటాడు మహేష్. అందుకే ఇప్పుడు సర్కార్ వారి పాట కు ఆ డిస్ట్రబెన్స్ ఏదైనా ఉంటుందా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ వీటన్నిటి నుంచి త్వరగా బయటపడి ప్రొఫెషనల్ గా బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సర్కార్ వారి పాట సంక్రాంతి బరి నుంచి వాయిదా పడింది. తదుపరి ఈ సినిమా ఏప్రిల్ 1న కూడా విడుదలయ్యే అవకాశం లేదని తాజాగా తెలుస్తోంది. ఆ తేదీని మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్రకటించడంతో తిరిగి షెడ్యూల్ మారనుంది. ఈ సన్నివేశంలో తమ అభిమాన నటుడితో ఏం జరుగుతుందోనని మహేష్ బాబు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సర్కార్ వారి పాటకు సంబంధించి అన్ని పనుల్ని పూర్తి చేసి సకాలంలో విడుదల చేయాల్సి ఉండగా మహేష్ కి ఊహించని అవాంతరాలు ఎదురవుతున్నాయి. కరోనా వల్ల.. ఆర్.ఆర్.ఆర్ వల్ల కూడా మూవీ రిలీజ్ ని వాయిదా వేయడం కూడా ఇప్పుడ మైనస్ గా మారింది.