వారం గ్యాప్ లోనే మహేష్ మరో ప్రాణదానం

Sat Oct 31 2020 21:00:39 GMT+0530 (IST)

Mahesh is another lifeline in the week gap

సూపర్ స్టార్ మహేష్ బాబు వేలాది మంది చిన్న పిల్లల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు ఆపరేషన్ చేయించారు. ఆంద్రా ఆసుపత్రి వారి సహకారంతో మహేష్ బాబు చేస్తున్న ఈ ఛారిటీ కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం నమ్రత ఇద్దరు చిన్నారులకు విజయవంతంగా గుండె చికిత్స జరిగింది. వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. వారి చేరికతో మా ఫ్యామిలీ మరింత పెద్దది అయ్యింది అంటూ నమ్రత ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వారం కూడా గడవకుండానే మరో చిన్న గుండెను మహేష్ బతికించాడు.నమ్రత మరోసారి చిన్నారి ఫొటోను షేర్ చేసి తను శ్రీ అనే ఈ చిన్నారి పూర్తి ఆరోగ్యంతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్నారి ప్రాణాలు కాపాడిన ఆంధ్రా ఆసుపత్రి వైధ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ నమ్రత ఇన్‌స్టాలో షేర్ చేసింది. మహేష్ బాబు మరియు నమ్రతలు చేస్తున్న ఈ మంచి పనికి ఎంత పొగిడినా తక్కువే. వేలాది మంది పిల్లల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు జంటకు మరియు వారి పిల్లకు అంతా మంచి జరగాలంటూ అభిమానులు మరియు గుండె ఆపరేషన్ జరిగిన పిల్లల కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.