ఫ్యామిలీతో విదేశాలకి మహేశ్ బాబు!

Sat May 14 2022 14:01:30 GMT+0530 (IST)

Mahesh Babu goes abroad with his family

మహేశ్ బాబు తన సినిమాలకి ఎంత ప్రాధాన్యతనిస్తాడో .. తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తాడు. తన ప్రాజెక్టుల విషయంలో ఆయన ఎంతమాత్రం తొందరపడడు. ఎవరో ముందుకు వెళ్లిపోతున్నారే అనే కంగారు ఆయనలో కనిపించదు. ఒకేసారి రెండు .. మూడు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలనే ప్రయత్నంలో హడావిడి పడిపోవడం ఆయనకి తెలియదు. సినిమా తరువాత సినిమాను ఆయన కూల్ గా చేస్తూ వెళతారంతే. సినిమాకి సినిమాకి మధ్యలో ఫ్యామిలీతో విదేశాలకి వెళ్లిరావడం ఆయన అలవాటు. ఒక్కోసారి చేస్తున్న సినిమా నుంచి లాంగ్ బ్రేక్ దొరికినా వెంటనే ఆయన ఫారిన్ ట్రిప్ ను ప్లాన్ చేస్తాడు. ఎక్కువగా ఆయన యూరప్ దేశాలకి వెళుతుంటాడు. ఈ సారి ఆయన యూఎస్ ఏ వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

మహేశ్ బాబు తాజా చిత్రమైన 'సర్కారువారి పాట' ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. తొలి రోజున భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా మొదలైంది. యాక్షన్  .. ఎమోషన్ కి మధ్య వచ్చిన పాటలు ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించాయి. ప్రతి పాట కూడా ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ సాగింది.

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ఉంది. వీకెండ్ తరువాత సినిమాకి వచ్చే రెస్పాన్స్  ప్రధానం. అందువలన అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వరం  ఫారిన్ వెళ్లడానికి మహేశ్ బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల  చివరికి ఆయన మళ్లీ ఇండియాకి తిరిగి రానున్నారు.

ఆ తరువాత సినిమాను ఆయన త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ తో మహేశ్ బాబు చేస్తున్న మూడో సినిమా ఇది. అందువలన అభిమానులందరిలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది.

ఇటు  త్రివిక్రమ్ మార్క్ కి తగినట్టుగా .. అటు మహేశ్ బాబు స్టైల్  కి తగినట్టుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఆల్రెడీ ఆమె త్రివిక్రమ్ తో రెండు సినిమాలు  .. మహేశ్ బాబుతో ఒక సినిమా చేసేసి ఉంది. జూన్ 28వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఆ తరువాత సినిమా రాజమౌళితో ఉండనుంది. మహేశ్ బాబు కెరియర్లోనే ఫస్టు పాన్ ఇండియా సినిమా ఇది. అత్యధిక బడ్జెట్ తో నిర్మితం కానున్న ఫస్టు మూవీ ఇది. ప్రస్తుతం  రాజమౌళి ఈ ప్రాజెక్టుపైనే గట్టిగానే కసరత్తు  చేస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.