Begin typing your search above and press return to search.

ఖ‌లేజా లాంటిదే ఇంకోటి ప్లాన్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   14 July 2020 5:10 AM GMT
ఖ‌లేజా లాంటిదే ఇంకోటి ప్లాన్ చేస్తున్నారా?
X
కొన్ని క‌ల‌యిక‌లు ఊహాతీతంగా ఉంటాయి. ఆ ఇద్ద‌రూ క‌లిస్తే మంచి సినిమాలు వ‌స్తాయి కానీ హిట్లు రావు. అలాంటి క‌ల‌యికే మ‌హేష్ - త్రివిక్ర‌మ్ జోడీ. `అత‌డు` లాంటి క్లాసిక్ ఈ ఇద్ద‌రి నుంచే వ‌చ్చింది. కామెడీ- ల‌వ్- రొమాన్స్ - స్నేహం- త్యాగం అంటూ ఎంతో గొప్ప‌గా తీసినా ఈ సినిమా పెద్ద తెర‌పై హిట్టు కాలేదు. ఆ త‌ర్వాతా ఖ‌లేజా లాంటి డిఫ‌రెంట్ టోన్ ఉన్న సినిమా వ‌చ్చింది ఈ జోడీ నుంచి. ఎస్.ఈ.జెడ్ లు దేవుడు అంటూ వెరైటీగానే తీశాడు. కానీ అది కూడా ఫ‌ట్టు.

కానీ ఇవి రెండూ బుల్లితెర‌పై బంప‌ర్ హిట్లు. వెండితెర రిలీజ్ వ‌ల్ల నిర్మాత‌లు పంపిణీదారుల‌‌కు క‌లిసి రాలేదు కానీ.. బుల్లితెర ఆడియెన్ కి మంచి ట్రీటిచ్చాయి. అత‌డు టీవీల్లో ఎన్నిసార్లు రిపీటెడ్ గా వ‌చ్చినా ఇంకా ఇంకా చూడాల‌నుకుంటారు ఆడియెన్. అంత కిక్కిచ్చే మూవీ అది. ఇక ఇన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌పై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌హేష్ ఇప్ప‌టికే త్రివిక్ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసినా ఈ ప్రాజెక్ట్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది.

త్రివిక్రమ్ తో దాదాపు క‌న్ఫామ్ అయినా మహేష్ డేట్స్ కోసం ఇంకో రెండేళ్లు ఆగాలని తాజాగా రివీలైంది. మ‌హేష్ ప్ర‌స్తుతం కెరీర్ 27వ సినిమా చేస్తున్నాడు. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాతా మ‌రో ఇద్ద‌రికి మాటిచ్చాడట‌. ఇక‌ త్రివిక్రమ్ కూడా ఖాళీగా లేడు. వ‌రుసగా ఇత‌ర‌ స్టార్ హీరోల‌కు క‌మిట‌య్యాడు. ప్ర‌స్తుత లాక్ డౌన్ స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ ని క‌లిసిన‌ మహేష్ మాత్రం ప్లాప్ మూవీ `ఖలేజా` స్టైల్ లో ఒక ఫన్నీ స్క్రిప్ట్ అడుగుతున్నాడు అని సమాచారం. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే టీవీల్లో హ్యాట్రిక్ కొట్టాల‌నుకుంటున్నారా? అంటూ సెటైర్ ప‌డిపోతుందేమో!