టీకాల కోసం మళ్లీ దత్తత తీసుకున్న శ్రీమంతుడు

Sun May 16 2021 18:00:48 GMT+0530 (IST)

Mahesh Babu comes in rescue of adopted villages in Covid times!

మనకు ఎంతో ఇచ్చిన ఊరికి తిరిగి ఇచ్చేయకపోతే లావయిపోతాం!అంటూ శ్రీమంతుడు చిత్రంలో డైలాగ్ చెప్పారు మహేష్. తాను ఆ ధర్మాన్ని మీరకుండా తూ.చ తప్పక ఆచరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బురిపాలెం- సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. మహేష్ సొంత గ్రామం బుర్రిపాలెం. పొరుగున ఉన్న గ్రామన్ని కలిపి రెండు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి ప్రజల కోసం చాలా దాతృత్వ సాయాలు చేసారు. ఇప్పుడు కరోనావైరస్ మహమ్మారి  కఠినమైన సమయాల్లో అతను తన మద్దతును అందిస్తున్నాడు.మహేష్ ఈ రెండు గ్రామాల ప్రజలందరికీ ప్రభుత్వ అధికారులకు విన్నవించి టీకాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మహమ్మారిపై పోరాడటానికి ప్రతి ఒక్కరూ టీకాలు వేయడం చాలా ముఖ్యం. ఆయన కృషి అభినందనీయం. ఇక దత్తత తీసుకోవడం అంటే మీనింగ్ కంటితుడుపుగా సాయం చేసి వదిలేయడం కాదని మహేష్ నిరూపిస్తున్నారు. ఏవో ఒక పాఠశాల రెండు భవనాలను నిర్మించేస్తే దత్తత తీసుకున్నట్టు కాదు. కష్టం వచ్చిన ప్రతిసారీ ఆదుకునేవాడే దేవుడు అని నిరూపిస్తున్నారు.

మహేష్ ఈ గ్రామాల ప్రజలను దత్తత తీసుకున్న రోజు నుండి వారికి సహాయం చేయడం ద్వారా సోకాల్డ్ రొటీన్ నాయకుడిలా కాకుండా తనదైన వ్యక్తిత్వంతో నిలబడ్డాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ విలయం కాస్త తగ్గాక చిత్రీకరణకు వెళతారు.