Begin typing your search above and press return to search.

నాన్న మహేష్ ‌తో సీతా పాప ఆట పాటా...

By:  Tupaki Desk   |   22 Jan 2021 4:00 AM GMT
నాన్న మహేష్ ‌తో సీతా పాప ఆట పాటా...
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ అండ్ ఫ్యామిలీ స‌డెన్ వెకేష‌న్ స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది డ్యూయ‌ల్ ప్లాన్ అని తెలిసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు. నిజానికి `స‌ర్కార్ వారి పాట` షెడ్యూల్లో పాల్గొనేందుకు వెళుతూనే.. త‌న ఫ్యామిలీని దుబాయ్ కి వెంట‌బెట్టుకుని వెళ్లారు మ‌హేష్‌.

అయితే అక్క‌డే నమ్రత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి కూడా మహేష్ బాబు.. అతని కుటుంబ సభ్యులు ప్లాన్ చేయ‌డం విశేషం. మ‌హేష్ గారాల‌ కుమార్తె సీతా పాప త‌న ఇన్ ‌స్టాగ్రామ్ లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వినోదభరితమైన ఫోటోని షేర్ చేసింది. డాడీతో సితార ఎంతో ఉల్లాసంగా ఈ జ‌ర్నీని ఆస్వాధించింద‌ని ఆ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది.

``ప్లేయింగ్ ది ఫూల్..!! ఎన్ రూట్ దుబాయ్..`` అంటూ ఆసక్తికరమైన క్యాప్ష‌న్ ని ఇచ్చింది దీనికి. #అమ్మాస్ బ‌ర్త్ డే డైరీస్..# దుబాయ్ కాలింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ల‌ను జోడించింది సితార‌.

అంతర్జాతీయ ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత ఘట్టమనేని కుటుంబం దుబాయ్ కి వెళ్ల‌డం ఇది రెండోసారి. వారు గత సంవత్సరం దుబాయ్ లో నమ్రతా సోదరి శిల్పా భర్త పుట్టినరోజును జరుపుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి అదే లొకేష‌న్ ని ఎంపిక చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం. దుబాయ్ .. ప్యారిస్.. స్విట్జ‌ర్లాండ్.. బ్రిట‌న్.. అమెరికా స‌హా ప‌లు దేశాలకు విహారం ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీకి కొత్తేమీ కాదు.