Begin typing your search above and press return to search.

పూరిపై మహేష్‌ కు కోపం ఏమీ లేనట్లేనా?

By:  Tupaki Desk   |   29 Sep 2020 6:15 AM GMT
పూరిపై మహేష్‌ కు కోపం ఏమీ లేనట్లేనా?
X
డాషింగ్‌ డైరెక్టర్‌ కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కేవలం హిట్స్‌ ఉన్నప్పుడు మాత్రమే పట్టించుకుంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ నాకు హిట్స్‌ పడ్డప్పుడు ఆయన నుండి పిలుపు వస్తుందని భావిస్తున్నాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూరి చాలా మామూలుగా ఆ వ్యాఖ్యలు చేశారు. అందులో చాలా గూడార్థం అయితే ఏమీ ఉండి ఉండదు. కాని మహేష్‌ అభిమానులు హర్ట్‌ అయ్యారు. ఆ విషయంలో పూరి జగన్నాధ్‌ ను రెండు మూడు రోజుల పాటు సోషల్‌ మీడియా ద్వారా ట్రోల్స్‌ చేస్తూ వచ్చారు.

కొత్త దర్శకులకు ఫ్లాప్‌ లో ఉన్న దర్శకులకు మహేష్‌ ఇచ్చిన ఆఫర్లను ఉదాహరణగా చూపిస్తూ సూపర్‌ స్టార్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో రెండు మూడు రోజుల పాటు కాస్త హడావుడి చేశారు. పూరి వ్యాఖ్యలపై మహేష్‌ బాబు ఎలా స్పందిస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. కాని మహేష్‌ బాబు మాత్రం లైట్‌ తీసుకున్నట్లుగా అనిపించింది. కాని కొందరు మాత్రం మహేష్‌ బాబు ఆ వ్యాఖ్యలను మనసులో పెట్టుకుని ఉంటాడు. ఖచ్చితంగా పూరితో మళ్లీ సినిమా చేయక పోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని మహేష్‌ బాబుకు పూరిపై ఎలాంటి కోపం లేదని క్లారిటీ వచ్చేసింది.

నిన్న పూరి పుట్టిన రోజు సందర్బంగా చాలా మంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు మహేష్ బాబు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నా ఫేవరేట్‌ డైరెక్టర్స్‌ లో ఒక్కరు అయిన పూరి జగన్నాద్‌ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మహేష్‌ ట్వీట్‌ చేశాడు. మహేష్‌ ట్వీట్‌ కు పూరి కూడా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దాంతో ఇద్దరి మద్య వివాదం అనేదే లేదు అంటూ తేలిపోయింది. కనుక ఇప్పుడు కాకున్నా మరికొన్నాళ్లకు అయినా మహేష్‌ తో పూరి అనుకున్న జనగణమన సినిమా మొదలయ్యే అవకాశం ఉందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.