వైట్ అండ్ వైట్ లో శ్రీవారి చెంతకు!

Fri Jan 17 2020 17:59:13 GMT+0530 (IST)

Mahesh Babu Visits Tirumala

సూపర్ స్టార్ మహేష్ వరుస హిట్లతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. భరత్ అనే నేను- మహర్షి చిత్రాలతో సంతృప్తికరమైన విజయాల్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే విడుదలైన సరిలేరు నీకెవ్వరు ఓపెనింగ్ వసూళ్ల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ఆనందంలోనే మహేష్ మొక్కులు తీర్చే పనిలో ఉన్నారు. తాజాగా మహేష్ సకుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. నమ్రత- సితార- గౌతమ్ సహా చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి- రాజేంద్ర ప్రసాద్- దిల్ రాజు ఇంకా ఇతర టీమ్ లో కీలక సభ్యులంతా వెంకన్న దర్శనం చేసుకున్నారు.దీనికి ముందు మహేష్ ఫ్యామిలీ ప్రత్యేకంగా స్పెషల్ దర్శనం కోసం సంప్రదాయబద్దంగా  తెలుపు వస్త్రాలు ధరించారు.  మహేష్- సితార- గౌతమ్ వైట్ అంట్  వైట్ కుర్తాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాళ్లతో పాటు అనీల్ రావిపూడి తెల్లటి పంచె ధరించి..గళ్ల షర్ట్ వేసుకుని ఫ్యామిలీ మేన్ మహేష్ తో  కలిసి ఫోటో  దిగారు. ఆ నలుగురు కలిసి  ఉన్న ఫోటో ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతకు ముందు నమ్రతో పిల్లలిద్దరిలో కలిసి వైట్ కుర్తాలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇలా ఫ్యామిలీ అంతా తిరుమలకు వెళ్లడం కొత్తేమీ కాదు. మహేష్ సినిమాలు సక్సెస్ అయితే దైవ దర్శనం తప్పనిసరి. విజయవాడ దుర్గమ్మతల్లిని ప్రత్యేకంగా దర్శించుకుంటారు. ఇక రెట్టించిన ఉత్సాహంతో   సరిలేరు సంపూర్ణ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇలా మొక్కులు తీరుస్తున్నారు. ఈ ప్రయాణాలు పూర్తయ్యాక.. మహేష్ కొంత గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.