EMK: ఎన్టీఆర్-మహేష్ చేసిన రచ్చ అప్పుడే

Sun Oct 24 2021 22:00:01 GMT+0530 (IST)

Mahesh Babu To Feature On Jr NTR EMK

వెండితెర అయినా.. బుల్లితెర అయినా ఇక స్టార్ హీరో కనిపిస్తేనే ఈలలు గోలలు చేస్తారు. అయితే ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు ఒకే చోట కనిపిస్తే ఏమైనా ఉంటుందా? బొమ్మ దద్దరిల్లడం ఖాయం. ఇప్పుడు అదే జరుగబోతోంది.  టాలీవుడ్ లోనే ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు కలిసి సందడి చేయబోతున్నారు.మహేష్ బాబు ఎన్టీఆర్ లు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. వీరిద్దరూ కలిస్తే ఎంటర్ టైన్ మెంట్ వేరే లెవల్లో ఉంటుందని ఇప్పటికే చాలా మందికి తెలుసు. బుల్లితెరపై వీరి రచ్చ చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్న గ్రాండ్ రియాలిటీ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'కి స్పెసల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు.ఈ  స్పెషల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా హాట్ సీట్ లో కూర్చునేందుకు మహేష్ బాబు రెడీ అయ్యారు.  ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు.

ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ బ్లాస్టర్ ఎపిసోడ్ ని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారనే తేది ఖాయమైంది. దీంతో సర్వత్రా బజ్ నెలకొంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే పలువురు ప్రముఖులతో భారీ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న ఈ షోకు మహేష్ బాబు వస్తే మరింత టీఆర్పీ రావడం ఖాయం. సో ఈ ఎపిసోడ్ ఎలా రక్తికడుతుందో చూడాలి.